అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలు స్పష్టంగా తెలిసిపోయాయి. మాటకారి, దూకుడు నేతగా పేరున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాజీ అయ్యారు. అదేసమయంలో నిదానస్తుడు.. వ్యూహకర్తగా పేరున్న జో బైడెన్ విజయం సాధించారు. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు భారత్‌పై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. మరీ ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీపై దీని ప్రభావం ఎక్కువగా ఉందనే వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఒకటి.. ట్రంప్ వ్యూహం బెడిసి కొట్టడం.. రెండు గతంలో మోడీని వ్యతిరేకించిన నాయకుడు.. ఆయనకు మూడు సార్లు.. అమెరికా వీసాను తిరస్కరించిన నాయకుడు బైడెన్ అధ్యక్షుడిగా ఎంపిక కావడం.
ఈ పరిమాణాలతో అధ్యక్ష పీఠం ఎక్కిన బైడెన్.. మున్ముందు భారత్ విషయంలో మరీముఖ్యంగా నరేంద్ర మోడీ మూడున్నరేళ్ల పరిపాలనపై ఎలాంటి ప్రభావంచూపుతుందనేది ఆసక్తిగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో అధ్యక్షుడు ట్రంప్ భారత్‌లోనూ, దీనికి ముందు భారత ప్రధాని మోడీ.. అమెరికాలోనూ పర్యటించారు. అమెరికాలో మోడీ పర్యటించినప్పుడు హౌడీ-మోడీ కార్యక్రమం నిర్వహించారు. అదేసమయంలో భారత్‌లో ట్రంప్ పర్యటించినప్పుడు .. నమస్తే.. ట్రంప్ కార్యక్రమం పేరిట భారీ ప్రచారం నిర్వహించారు. ఇద్దరు నేతలు ఈ ప్రపంచానికి అవసరం అనే స్థాయిలో ఈ ప్రచారం గగనాన్ని తాకింది. దీంతో అగ్రరాజ్యంలోని భారతీయ ఓటర్లను ఆకర్షించేందుకు ట్రంప్ ఈ ఫార్ములాను బాగానే వాడుకున్నారు.
నార్త్ ఇండియన్స్ విషయానికి వస్తే.. హూస్టన్‌లో హౌడీ మోడీకి బ్రహ్మరథం పట్టారు. టెక్సాస్‌లో నమస్తే.. ట్రంప్‌కు జై కొట్టారు. వాస్తవానికి మోడీ-ట్రంప్ జోడీని ఆర్ ఎస్ ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ, మోడీ సహా బీజేపీలు ట్రంప్‌ను మోసేశారు. ఆయన గెలుపుగుర్రం ఎక్కాలని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇది ఒక్కటే కాదు.. రష్యాలోనూ పుతిన్‌ను మోడీ సమర్ధించారు. వీరి ముగ్గురికి మధ్య ఒకే భావజాలం ఉండడం గమనార్హం. అయితే, ఇప్పుడు ట్రంప్ ఓడిపోయారు. పుతిన్ రాజీనామా బాటలో ఉన్నారు. దీంతో ఇప్పుడు మోడీని బలపరిచేవారు అంతర్జాతీయంగా ఎవరున్నారనే ప్రశ్న తెరమీదికి వచ్చింది.
ప్రధానంగా యువత ఈ ముగ్గురి ఐడియాలజీనీ వ్యతిరేకించినట్టు స్పష్టమైంది. అమెరికాలో ట్రంప్ గెలిచి ఉంటే.. మోడీ వ్యూహం ఫలించిందని ఇక్కడ బీజేపీ చెప్పుకొనేందుకు అవకాశం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. అంతేకాదు, మోడీతో ఎక్కువ స్నేహం చేసినా.. ఆశీర్వాదాలు పొందినా డేంజర్ అనే సంకేతాలు కూడా వచ్చేశాయని అంటున్నారు పరిశీలకులు. గతంలో మోడీతో అంటకాగిన తమిళనాడు సీఎం జయలలిత.. అర్ధంతరంగా ఆయనతో తెగతెంపులు చేసుకున్నా.. నిలవలేక పోయారు. ఇప్పుడు ట్రంప్ ఓడిపోయారు. పుతిన్ రాజీనామా కు సిద్ధమయ్యారు.
ఇలా జాతి, మతం, ప్రాంతం, కులం అనే తేడా లేకుండా మోడీ హవాకు బ్రేకులు పడ్డాయి. ఇక, ఇప్పుడు అమెరికాలో బైడెన్ శకం ప్రారంభం కానుంది. ఇది మరింతగా మోడీని ఇరకాటంలోకి నెడుతుందని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం.. బైడెన్ వ్యూహాలకు, మోడీ వ్యూహాలకు పొంతన లేకపోవడం. గతంలో మత ఘర్షణలకు కారణమనే కోణంలో మోడీ వీసాను బైడెన్ మూడు సార్లు తిరస్కరించారు. దీనిని పునరుద్ధరించుకునేందుకు అప్పట్లో బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే ఆమెకు విదేశాంగ మంత్రిత్వ శాఖను ఇచ్చారనే ప్రచారం కూడా ఉంది. ఇక, ఇప్పుడు బైడెన్ .. అటు చైనాకు, ఇటు పాకిస్థాన్‌కు కూడా మిత్రత్వం వహించే నాయకుడుగా ఉన్నారు. ట్రంప్ మాదిరిగా చైనా, పాక్ ల విషయంలో ఆయన వైఖరి కఠినంగా ఉండబోదు.. ఇది కూడా మోడీకి తీవ్ర ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే.. చైనా నుంచి పాక్ నుంచి కూడా భారత్ తీవ్ర సమస్య ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో మోడీకి ఇంటా బయటా కూడా చిక్కులు తప్పవనే సంకేతాలు దాదాపు వెలువడ్డాయని అంటున్నారు పరిశీలకులు. మరి వీటిని మోడీ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.