టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఏర్పడిన తర్వాత బొప్పూడిలో జరిగిన తొలి బహిరంగ సభ నభూతో న భూతో న భవిష్యత్ అన్న రీతిలో గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత త్రిమూర్తులు మోడీ , చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం చేతులు కలిపిన ఈ ముగ్గురు మొనగాళ్లను చూసేందుకు రాష్ట్రం నలువైపుల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కార్యకర్తలు, అభిమానులు లక్షలాదిగా తరలి వచ్చి సభను జయప్రదం చేశారు. సభ ముగిసిన తర్వాత ఈ ముగ్గురి మధ్య జరిగిన ఘటన ఒకటి హాట్ టాపిక్ గా మారింది.
సభ ముగిసిన తర్వాత ప్రధాని మోడీని సాగనంపేందుకు చంద్రబాబు, పవన్ ఆయన వెంట కొద్ది దూరం నడిచారు. అయితే మోడీ ప్రత్యేక కాన్వాయ్ పార్కింగ్ చేసిన ప్రదేశానికి 10 అడుగుల దూరంలో చంద్రబాబు, పవన్ ఆగిపోయారు. ఆ తర్వాత కొంచెం దూరం ముందుకు వెళ్లిన మోడీ…. చంద్రబాబు, పవన్ తనతో రావడం లేదని గమనించి వాకబు చేశారు. వెంటనే పవన్, చంద్రబాబు ఆయన దగ్గరకు వెళ్లారు. ఆ తర్వాత తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కొంతదూరం వెళ్ళమని చెప్పిన మోడీ…. చంద్రబాబు, పవన్ తో ప్రత్యేకంగా 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు.
ప్రజాగళం సభ గ్రాండ్ సక్సెస్ అయిందని, లక్షలాదిగా ప్రజలు తరలిరావడం సంతోషంగా ఉందని మోడీ ప్రశంసించినట్లుగా తెలుస్తోంది. ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారని, ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక, చంద్రబాబు అరెస్టు, ఆయన ఆరోగ్యం, ఏపీలో రాజకీయ పరిణామాలపై మోడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏపీలో జగన్ విధ్వంసకర పాలనపై మోడీకి చంద్రబాబు, పవన్ ఒక నివేదిక కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
అంతకుముందు సభా వేదికపై ప్రధాని మోడీకి తాను చెప్పేది బాగా అర్థం కావాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు హిందీలో కొంచెం సేపు అనర్గళంగా ప్రసంగించడం ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హిందీలో ఇచ్చి పడేసిన చంద్రబాబు ..!#ChandrababuNaidu #TDP#pavankalyan #Janasena#Modi #amithsha #BJP4IND#prajagalamsabha#CMJagan #YCP#apelections2024 #TV5News pic.twitter.com/OtgdtKJg3q
— TV5 News (@tv5newsnow) March 17, 2024