దేశవ్యాప్తంగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారం నిలబెట్టుకుంటుందని, ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని మెజారిటీ సర్వేలు తేల్చాయి. ఇక, ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలోని ఎన్డీఏ కూటమి అధికారం చేపడుతుందని సర్వేలు చెబుతున్నాయి.
మోడీ హ్యాట్రిక్ పీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మూడో సారి సీఎం కావడం ఖాయమని ఆ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి కనీసం 16-22 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుందని, 120-130 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఇక, తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ కు షాకిచ్చేలా ఉన్నాయి. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం.. తెలంగాణలో కాంగ్రెస్ 6-8 మధ్య, బీజేపీ 8-9 మధ్య, ఎంఐఎం 1, బీఆర్ఎస్-0 గెలుస్తాయి.
ఆరా సర్వే సంస్థ ప్రకారం.. కాంగ్రెస్ 7-8 మధ్య, బీజేపీ 8-9 మధ్య, ఎంఐఎం 1, బీఆర్ఎస్-0 గెలుచుకుంటాయి.ఏబీపీ-సీ ఓటర్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ 7-9 మధ్య, బీజేపీ 9-12 మధ్య, ఎంఐఎం 1, బీఆర్ఎస్-0 గెలుచుకుంటాయి. పీపుల్స్ పల్స్ ప్రకారం.. కాంగ్రెస్ 7-9 మధ్య, బీజేపీ 6-8 మధ్య, ఎంఐఎం 1, బీఆర్ఎస్-0-1 గెలుచుకుంటాయి. జన్‌కీ బాత్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ 4-7 మధ్య, బీజేపీ 9-12 మధ్య, ఎంఐఎం 1, బీఆర్ఎస్-0-1 గెలుచుకుంటాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానానికి మించి గెలవలేదని అభిప్రాయపడ్డాయి
ఎన్డీయే 400కుపైగా సీట్లు వస్తాయని, ఇండియా టీవీ – సీఎన్ఎక్స్, టుడేస్ చాణక్య, ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా సర్వేలు తేల్చాయి. ఇండియా కూటమి డబుల్ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశముందని టుడేస్ చాణక్య సర్వే అంచనా వేసింది. ఎన్డీయేకు 350కిపైగా స్థానాలు వస్తాయని ఇండియా టుడే, ఇండియా న్యూస్ – డి డైనమిక్స్, జన్ కీ బాత్, రిపబ్లిక్ భారత్ – మ్యాట్రిజ్; రిపబ్లిక్ టీవీ- పి మార్క్; టుడేస్ చాణక్య సంస్థలు అంచనా వేశాయి.
దైనిక్ భాస్కర్ మినహా మిగతా సంస్థలన్నీ ఎన్డీయే కూటమికి 350 సీట్లకు పైనే వస్తాయని; ఇండియా కూటమికి 200 స్థానాల్లోపు వస్తాయని అంచనా వేశాయి. ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ సర్వే ప్రకారం.. ఎన్డీయేకు 361; ఇండియా కూటమికి 145; ఇతరులకు 37 సీట్లు లభించనున్నాయి. పదేళ్లుగా ఉత్తరాదికి, ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన బీజేపీ.. ఈసారి దక్షిణాదిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో స్థానాలు కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. కేరళలో 1-3 సీట్లు, తమిళనాడులో బీజేపీకి అనూహ్యంగా 5 నుంచి 7 సీట్ల వరకు వస్తాయని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్, జన్ కీ బాత్ తేల్చాయి. కర్ణాటకలో ఎన్డీయే 23-25 సీట్లను సాధిస్తుందని ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా పోల్‌తోపాటు న్యూస్ 18 సంస్థ అంచనా వేసింది.
ఒడిసాలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశముందని, లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పశ్చిమ బెంగాల్లో గతంలో కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని, ఇక్కడ తృణమూల్ కాంగ్రె్‌సను మించి లోక్‌సభ సీట్లను సాధిస్తుందని విశ్లేషిస్తున్నాయి. బిహార్‌లో ఈసారి కూడా ఎన్డీయే కూటమికే మెజారిటీ సీట్లు వస్తాయని స్పష్టం చేస్తున్నాయి. ఉత్తరాది మళ్లీ కమలం వికసిస్తుందని తేల్చాయి.
అయితే, ‘ఇండియా’ కూటమి విజయోత్సవాలకు మరో మూడు రోజులు మాత్రమే ఉందని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలు తరిమికొట్టారని అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో కూటమి నేతలు మరింత అప్రమత్తతో ఉండాలని పిలుపునిచ్చారు. ‘ఇండియా’ కూటమి కనీసం 295 సీట్లు సాధిస్తుందని, దిగిపోతున్న ప్రధాని ఇండియా కూటమిని మానసికంగా దెబ్బకొట్టేందుకు ఈ తరహా ఆటలు ఆడుతున్నారని, అసలు ఫలితాలు భిన్నంగా ఉంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ జోస్యం చెప్పారు. ఎన్డీఏ కూటమి గెలిస్తే తాను గుండు కొట్టించుకుంటానని మరో కాంగ్రెస్ నేత ఛాలెంజ్ చేశారు.
ఏబీపీ- సీ ఓటర్…
టీడీపీ కూటమి 21-25
వైసీపీ 0-4
ఇతరులు 0
ఇండియా టీవీ…
టీడీపీ 13-15
వైసీపీ 3-5
బీజేపీ 4-6
జనసేన 2
ఇతరులు 0
ఇండియా న్యూస్- డీ డైనమిక్స్
టీడీపీ కూటమి-18
వైసీపీ- 7
ఇతరులు-0
పీపుల్స్ పల్స్…
టీడీపీ 13-15
వైసీపీ 3-5
జనసేన 2
బీజేపీ 2-4
ఇతరులు 0
ఆరా…
వైసీపీ- 17
టీడీపీ కూటమి- 8
ఇతరులు- 0
సీఎన్ఎక్స్…
టీడీపీ 13-15
వైసీపీ 3-5
బీజేపీ 4-6
జనసేన 2
రైజ్…
టీడీపీ కూటమి 17-20
వైసీపీ 7-10
ఇతరులు 0
చాణక్య స్ట్రాటజీస్…
టీడీపీ కూటమి 17-18
వైసీపీ 6-7
ఇతరులు 0
పయనీర్…
టీడీపీ కూటమి- 20 ప్లస్
వైసీపీ- 5
ఇతరులు- 0
కేకే సర్వీస్…
టీడీపీ- 17
వైసీపీ- 0
బీజేపీ- 6
జనసేన- 2
జన్ కీ బాత్…
టీడీపీ 13-15
వైసీపీ 3-5
జనసేన 2
బీజేపీ 0