‘‘రాజమండ్రి వస్తే తిరిగి వెళ్ళలేవు నీ అంతు చూస్తా’’ అంటూ మహాసేన రాజేష్ కు వచ్చిన బెదిరింపు కాల్ ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇదేదో వైసీపీలో తృతీయ శ్రేణి నాయకుడెవరో చేసిన బెదిరింపు కాల్ కాదు..స్వయానా వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ చేసిన కాల్. రాజమండ్రి వచ్చి తిరిగి వెళ్లగలవా అంటూ రాజేష్ కు గణేష్ ధమ్కీ ఇస్తున్న వైనం వైరల్ గా మారింది.
4 వందల కోట్ల విలువైన ఆస్తులను జక్కంపూడి రాజా ఆక్రమించారని మహాసేన రాజేష్ ఆరోపణలు చేస్తున్నారు. రాజమండ్రిలోని షాడే స్కూల్ ఆస్తులను కబ్జా చేసేందుకు వైసీపీకి చెందిన ఓ మంత్రి, ఓ వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు ప్రయత్నిస్తున్నారని ఓ పత్రికలో కథనం కూడా వచ్చింది.ఈ క్రమంలోనే రాజమండ్రి వెళ్లేందుకు మహాసేన రాజేష్ ప్రయత్నించారు. దీంతో, రాజేష్ కు వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ ఫోన్ చేశారు.
దీంతో, ఆ ఫోన్ సంభాషణలో రాజేష్ కు గణేష్ వార్నింగ్ ఇచ్చారు. రాజమండ్రి వస్తే తిరిగెళ్లవు అంటూ ధమ్కీ ఇచ్చారు. అయితే, టైం, డేట్, ప్లేస్ చెప్పాలని..తాను రాజమండ్రి వచ్చి ఫోన్ చేస్తానని రాజేష్ జవాబిచ్చారు. దీంతో, గణేష్, రాజేష్ ల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోన్ కాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అన్యాయాన్ని ఎదిరించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడుతున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.
రాజమండ్రి వస్తే తిరిగి వెళ్ళలేవు నీ అంతు చూస్తా అంటూ మహాసేన రాజేష్ ను బెదిరించిన వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తమ్ముడు pic.twitter.com/AtMZkK0eHw
— I Love India✌ (@Iloveindia_007) September 11, 2022