వైఎస్ షర్మిలపై హైదరాబాద్ లోని ఎన్బీకే బిల్డింగ్ నుంచి సోషల్ మీడియా దుష్ప్రచారం గతంలో జరిగిందని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారం జరిగిందని షర్మిల అన్న మాటలను జగన్ రెండ్రోజుల క్రితం ప్రెస్ మీట్ లో ప్రస్తావించడం షాకింగ్ గా మారింది. ఈ క్రమంలోనే తొలిసారిగా ఆ వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు. షర్మిలపై తప్పుడు ప్రచారం చేసేదెవరో ప్రజలకు తెలుసని, ఆ తప్పుడు ప్రచారాన్ని వారే పట్టించుకోనప్పుడు నేనెందుకు పట్టించుకోవాలని అని బాలయ్య అన్నారు.
వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా మనుషులను పెట్టుకున్నారని చురకలంటించారు. అయితే, పీఏసీ ఎన్నికలో వారు పాల్గొనేందుకు అసెంబ్లీకి వస్తారని, వారు స్వార్థపరులని చెప్పారు. అయితే, వారు ఈ రోజు కూడా సభకు రాకుంటే బాగుంటుందని, వచ్చినా వృథా ప్రయాస అని చమత్కరించారు. అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనేందుకు వచ్చిన బాలయ్యను గన్నవరం విమానశ్రయంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా బాలయ్య పై విధంగా జవాబిచ్చారు.