వైసీపీలో మరో రెబల్ తయారవుతున్నారా ? అదికూడా జగన్మోహన్ రెడ్డికి ఎంతో సన్నిహితుడైన ఎంపీనే తిరుగుబాటు చేయబోతున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది పార్టీ వర్గాల నుండి. ఇంతకీ విషయం ఏమిటంటే ఒక అసెంబ్లీ టికెట్ వివాదమే దీనికి కారణంగా తెలుస్తోంది. విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో తన కొడుకు సూర్యప్రకాష్ ను పోటీచేయించాలని రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ డిసైడ్ అయ్యారు.
అయితే జగనేమో ఇపుడు సిట్టింగ్ ఎంఎల్ఏ, మంత్రి అయిన చెల్లుబోయిన వేణగోపాలకృష్ణనే పోటీచేయించాలని డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని ఎంపీ, జిల్లా ఇన్చార్జి మిథున్ రెడ్డి తో ప్రకటన చేయించారు. దాంతో పిల్లికి మండింది. తన కొడుకును కాదని మంత్రికే మళ్ళీ టికెట్ ఇవ్వటం ఏమిటనేది పిల్లి వాదన. అయితే సిట్టింగ్ ఎంఎల్ఏనే మళ్ళీ పోటీచేయించాలని అనుకోవటంతో తప్పేముందని మిథున్ వాదిస్తున్నారు. దీంతో ఇటు పిల్లి అటు మంత్రి మధ్య గొడవలు పెరిగిపోయాయి.
ఈ నేపధ్యంలోనే పిల్లిని పిలిపించుకున్న జగన్ అన్ని విషయాలు మాట్లాడటమే కాకుండా క్లాస్ పీకి పంపారు. దాంతో టికెత్ తన కొడుక్కి దక్కదని అర్ధమైపోయింది. అందుకనే తన కొడుకును పోటీచేయించే విషయమై పిల్లి ప్లానులు వేస్తున్నారు. మద్దతుదారులతో మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో తన కొడుకు పోటీచేయటం ఖాయమని చేసిన ప్రకటన సంచలనంగా మారింది. జగన్ స్వయంగా మంత్రే పోటీచేస్తారని డిసైడ్ చేసిన తర్వాత కూడా పిల్లి తన కొడుకు పోటీచేస్తారని ఎలా ప్రకటించారు ? అన్నదే అర్ధంకావటంలేదు.
విషయాలు గమనిస్తున్న పార్టీ నేతలు మాత్రం తొందరలోనే పిల్లి పార్టీ మారిపోతారేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదో పార్టీలోకి మారితే కానీ కొడుకును పిల్లి పోటీ చేయించలేరన్నది వాస్తవం. అయితే పిల్లి ప్రత్యర్ధిపార్టీలతో టచ్ లో ఉన్నారనే విషయం జగన్ కు తెలిసింది కాబట్టే టికెట్ విషయంలో క్లాసు తీసుకున్నారనే ప్రచారం కూడా పెరిగిపోతోంది. ఇదంతా చూసిన తర్వాత తొందరలోనే పిల్లి కూడా రెబల్ గా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని పార్టీ నేతలు అనుకుంటున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.