తిరుమల కొండపై వైసీపీ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. మంత్రి సీదిరి అప్పలరాజు, ఉషా శ్రీ చరణ్, రోజాలు భారీ అనుచరగణంతో బ్రేక్ దర్శనాలు చేస్తుండడంతో సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సరే నిబంధనలను పక్కకు పెట్టి మరీ వైసీపీ నేతలకు బ్రేక్ దర్శనం కల్పించడంపై విమర్శలు వస్తున్నాయి. సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా సరే మాకేంటి అన్న రీతిలో వైసీపీ మంత్రులు, వారి అనుచరులు మందీమార్బలంతో బ్రేక్, ప్రత్యేక దర్శనాలు చేసుకోవడంతో గంటల తరబడి భక్తులు వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా శ్రీకాళహస్తిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం ఆయన అనుచరులు వేసిన వీరంగంతో భక్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సూర్యగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చిన వందలాది భక్తులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
సూర్యగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసినా… శ్రీకాళహస్తిలో మాత్రం ప్రత్యేక పూజలు చేస్తారు. దీంతో, ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చారు. అదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సతీమణి.. కొడుకులు, కోడళ్లు.. మనవలు, ఇతర బంధువులతో దర్శనానికి వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, క్యూలైన్లలో ఉన్న భక్తులను పెద్దిరెడ్డి అనుచరులు ఇబ్బంది పెట్టడం వివాదానికి దారితీసింది.
పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను అభిషేకానికి తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు నానా హడావిడి చేశారు. భక్తులను పక్కకు జరుపుతున్న క్రమంలో తోపులాటలు జరిగాయి. దీంతో, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులపై కొందరు భక్తులు తిరగబడ్డారు. ఆ క్రమంలో భక్తులను వైసీపీ నేతలు, పోలీసులు తోసేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపురెడ్డి మధుసూదన్ రెడ్డి అనుచరుల హస్తం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా…కష్టాలు తొలగించుకునేందుకు శ్రీకాళహస్తిలో దర్శనానికి వచ్చిన భక్తులకు పెద్ది రెడ్డి అనుచరులు కొత్త కష్టాలు తెచ్చిపెట్టడం వైరల్ గా మారింది.
శ్రీకాళహస్తి గుడిలో భక్తులపై..
వైసీపీ గూండాల దాడి..????????????
స్వయంగా మంత్రి పెద్దిరెడ్డికి చెందిన ముఠానే ఈ దాడులకు పాల్పడ్డారు..????????????????#EndOfYCP #Ycheeps #JaganMustResign #AndhraPradesh pic.twitter.com/Cx1qZVio6K— Balaji Gupta (@BalajiGupta) October 25, 2022