వైసీపీ అధినేత జగన్ ఒక నిర్ణయానికి వచ్చారట. పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయడానికి శతధా ప్రయత్నించి సామదానబేధదండోపాయాలు వాడినా అవి సఫలం కాకపోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో ఎన్నికలకు సహకరించడానికి జగన్ ఒప్పేసుకున్నారు.
తాజాగా పంచాయతీ ఎన్నికలు జరగడం ఖరారైపోయింది. ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తోంది. సుప్రీంకోర్టులో కూడా నిమ్మగడ్డకే మద్దతు రావడంతో ప్రజల్లో జగన్ పలుచన అయిపోయారు. తీర్పు వచ్చిన మరుక్షణమే వైకాపా నాయకులు నాలుక మడతేశారు.
ఈ నేపథ్యంలో జగన్ కొత్త నిర్ణయం తీసుకున్నారట. తనకు సరిగా అప్పులు పుట్టని కారణంగా కొన్ని సంస్కరణలు తీసుకువస్తే అప్పులు పుడతాయన్న ఆశతో జగన్ వాటిని అమలుపరచడానికి ప్రయత్నిస్తున్నారు.
తొలుత రైతుల మీదే పడ్డారు. ఉచిత విద్యుత్తుకు చాలా ఖర్చవుతోంది. దాన్ని కంట్రోల్ చేయడానికి రైతుల మోటార్లకు మీటర్ పెడతారట జగన్ రెడ్డి. ఒక్కసారి రైతుకు మీటర్ పెట్టారంటే ఇక అది తీయరు. ఇక క్రమంగా ఉచిత విద్యుత్తు మాయమైపోతుంది. ప్రస్తుతానికి తిరిగి ఆ డబ్బులు మన అక్కౌంట్లో వేస్తాం అని చెప్పినా కాలక్రమేణా అది మారిపోవచ్చు.
అయితే… ఇప్పటికే ఈ మీటర్ స్కీం ప్రకటించాం కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికల్లో కనుక గెలిస్తే రైతుల మోటార్ల కు మీటర్లు పెట్టడానికి జగన్ సిద్ధమైపోయారట. ఇపుడు రైతులు అప్రమత్తం కాకపోతే మీ భవిష్యత్తు అదోగతి అంటూ జగన్ ప్లాన్ ను ప్రతిపక్షాలు లీక్ చేశాయి. వైసీపీ మద్దతుదారులను పంచాయతీ ఎన్నికల్లో గెలిపిస్తే రైతుల మోటర్లకు మీటర్ రావడం గ్యారంటీ అన్నమాట.
తెలంగాణలో కేసీఆర్ ని ఉప ఎన్నికల్లో ఓడించినట్టే జగన్ ని కనుక ఉప ఎన్నికల్లో ఓడిస్తే… కచ్చితంగా రైతులు, ప్రజల భయం ఉంటుంది. తన సాహసాలు, సంస్కరణలు అన్నీ జగన్ ఆపేసే అవకాశం లేకపోలేదు. పంచాయతీ ఎన్నికల్లో కనుక వైసీపీ మద్దతు దారులు గెలిస్తే ఇక మీటర్ గిర్రున తిరగాల్సిందే.