AP ఏపీ YCP నేతలు నోటికి వచ్చిన మాటల్ని అనేయటం కొత్తేం కాదు.
కాకుంటే.. మిగిలిన నేతలు ఒక మాట అన్న తర్వాత ఆ మాటను తాము ఆ ఉద్దేశంతో అనలేదనే వాదనను వినిపిస్తుంటారు.
కానీ.. YSRCP నేతలు మాత్రం అందుకు భిన్నంగా.. ‘‘ఆ మాటే అన్నాం.. ఎందుకు అన్నాం’’ అంటూ ఎదురు దాడి చేసే తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.
ఇలాంటి తీరు వారికి మాత్రమే చెల్లుతుందని చెప్పాలి.
అనరాని మాటల్ని అనేయటం ఒక ఎత్తు అయితే.. తాము అన్న మాటలకు పశ్చాతాపం చెందకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడే విషయంలో తమకు మించినోళ్లు మరెవరూ ఉండరన్న భావన కలిగేలా వ్యవహరిస్తుంటారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఏపీ అసెంబ్లీలో TDP MLA టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయస్వామిని ఉద్దేశించి.. ఎస్సీకి ఎలా పుట్టావు? అంటూ మంత్రి Merugu Nagarjuna మేరుగు నాగార్జున చేసిన వ్యాఖ్యలు సభలో పెను దుమారాన్ని రేపాయి.
తన పుట్టుకనే ప్రశ్నించిన మంత్రిని బర్తరఫ్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
అసలీ వివాదం ఎలా మొదలైందన్నది చూస్తే.. స్పీకర్ పోడియం ముందు ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒకరైన వీరాంజనేయ స్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి మేరుగ.. ‘నీకు చేతనైతే.. నువ్వు దళితుడివైతే.. దళితులకు పుడితే.. టీడీపీ నుంచి బయటకు రా. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’ అంటూ మండిపడ్డారు.
దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఒక ఎస్సీ ఎమ్మెల్యే అయిన తనను.. నువ్వు దళితుడికే పుట్టావా అంటారా? పుట్టుకనే ప్రశ్నిస్తారా? జగన్ నేర్పిన సంస్కారం ఇదేనా? అంటూ ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ప్రతిపక్ష సభ్యుడిగా సభలో నిరసన తెలిపే హక్కు తనకు ఉందన్నారు.
‘ఇక్కడ పుట్టుక గురించి మాట్లాడతారా? మేమెప్పుడైనా వారి పుట్టుకపై మాట్లాడామా? వారు మాత్రం లోకేశ్.. చంద్రబాబు పుట్టుక గురించి మాట్లాడతారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దారుణమైన మాట అని అనలేదంటున్నారు. రికార్డుల్ని పరిశీలించాలని.. ఒకవేళ ఆయన అనకుంటే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.
ముఖ్యమంత్రి జగన్ కు దళితులపై చిత్తశుద్ధి ఉంటే. మంత్రిని బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ చేశారు.
దళితులకు రాష్ట్రంలో రక్షణ లేదని.. మరో అంబేడ్కర్ పుడితే తప్పించి ఇక్కడ కూర్చున్న కౌరవ సైన్యంలో మార్పు రాదని.. తనకు న్యాయం చేయాలని స్పీకర్ తమ్మినేనిని కోరారు.
దీనిపై స్పందించిన మంత్రి మేరుగ.. ‘‘ఏపీ స్టడీ సర్కిల్ పై మాట్లాడుతున్న వేళ వీరాంజనేయ స్వామి ప్లకార్డును నా ఎదురుగా పెట్టి నీకేం గౌరవం ఉంది? నువ్వు దళితుడివా అని అంటే.. నేను మాట్లాడా. దాన్లో తప్పేముంది?’ అని బదులిచ్చారు.
సభలో వీరాంజనేయస్వామి తీరు సరిగా లేదని.. తాను తప్పుగా మాట్లాడితే వెనక్కి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఒకవేళ.. టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. ఆ విషయాన్ని చర్చకు పెట్టి.. ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. అనరాని మాట అనేసి.. ఆ తర్వాత ఆయన అంటేనే.. తాను అన్నట్లుగా మంత్రి చేసిన సమర్థన చర్చనీయాంశంగా మారింది.
ఏమైనా.. సభలో తాము టార్గెట్ చేసిన విపక్ష నేతల్ని ఉద్దేశించి.. ఏమైనా అనేయొచ్చన్న రీతిలో వైసీపీ నేతల తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
pdhbks