ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ‘వకీల్‌సాబ్’ బెన్ఫిట్ షోలను నిలిపివేయడం, టికెట్ ధరలను పెంచేందుకు జగన్ సర్కార్ అనుమతినివ్వకపోవడంపై పెను దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. పవన్ పై జగన్ కక్ష సాధించేందుకు ఇలా చేశారని జనసేన, టీడీపీ నేతలు విమర్శిస్తుంటే….మెగా బ్రదర్ నాగబాబు మాత్రం జగన్ ను వెనకేసుకు రావడంపై విమర్శలు వస్తున్నాయి.
జగన్ ఇలాంటి పనులు చేసే వ్యక్తి కాదని, జగన్ పాలనాపరమైన వ్యవహారాలు, రాష్ట్ర సమస్యలపై పోరాటంతో జగన్ బిజీగా ఉన్నారని నాగబాబు చెప్పడం మెగా అభిమానులకు మింగుడుపడడం లేదు. పైగా ఆయా ప్రాంతాల్లో లోకల్ ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఈ పనులు చేసి ఉంటారని నాగబాబు చెప్పడం విశేషం. జగన్‌కు ఈ విషయం తెలిస్తే తప్పకుండా స్పందిస్తారని, నాగబాబు జగన్ కు కితాబివ్వడం కొసమెరుపు.
రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా ఫర్వాలేదన్న నాగబాబు…వృత్తిపరమైన జీవితంలో ఇలాంటి ఇబ్బందులు సృష్టించకూడదంటూ హితవు పలికారు. దీని వల్ల సినిమానే ఆధారంగా చేసుకొని బతుకుతున్న ఎన్నో కుటుంబాలు, కార్మికులు నష్టపోతారని నాగబాబు అన్నారు. కొద్ది రోజుల క్రితం జగన్ పై చిరంజీవి కూడా ప్రశంసలు కురిపించారు.
ఇక, మంత్రి పేర్ని నాని గారికి కరోనా వ్యాక్సిన్‌తో పాటు రేబిస్ వ్యాక్సిన్ కూడా వేయాల్సిందని, మినిస్టర్ నానికి రేబిస్ వ్యాక్సిన్ పంపితే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఫ్రీ అంటూ నాగబాబు షాకింగ్ ట్వీట్ చేయడం ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపుతోంది. బయటివారి కన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్‌కు రేబిస్ వ్యాక్సిన్ తక్షణ అవసరం అని, ఆలస్యమైతే మీకు కూడా రేబిస్ వ్యాక్సిన్ అవసరం అవుతుందని నాగబాబుకు నాని కౌంటర్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో చిరంజీవి, నాగబాబులపై సోషల్ మీడియాలో మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఏమి బానిస బతుకు బతుకుతున్నారు నాగబాబు మీ కుటుంబం అంటూ మెగా అభిమాని ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కి తెలియకుండా స్థానిక నేతలు చేశారని చెప్పడానికి సిగ్గుగా లేదా అని ఆ అభిమాని ఏకిపారేశారు. రాష్ట్రం మొత్త బెనిఫిట్ షో రద్దు చేస్తే జగన్ కు తెలీదా అని ప్రశ్నించారు. పైగా ఈ విషయంపై ప్రభుత్వం తరపున డివిజన్ బెంచ్ కి అప్పీల్ కూడా చేశారని, అది జగన్ కి తెలియకుండా జరుగుతుందా??? అని సూటిగా ప్రశ్నించారు.
” మీకు మెగా ఫ్యామిలీ, లెజెండ్ అని ట్యాగ్ లైన్ లు అనవసరమని, మీ తలకాయలు తీసుకెళ్ళి వాడి కాళ్ళ దగ్గర పెట్టండి. వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోండి… ఈ మధ్య కొత్తగా దేవుడు అయ్యాడు మీలాంటి కొంత మందికి. ఒకప్పుడు మీ ఫ్యామిలీ ఫ్యాన్ ని అని చెప్పుకొడానికి కూడా సిగ్గు పడుతున్నా” అని ఆ మెగా అభిమాని తన ఆవేదననను వెళ్లగక్కాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.