అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభు వివాహం దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. 36 సంవత్సరాల ప్రభు… తన 19 ఏళ్ల కూతురును పెళ్లి చేసుకోవడంపై అమ్మాయి తండ్రి కోర్టుకు వెళ్లాడు. తనకు కులాంతర వివాహం అని అభ్యంతరం లేదని… కానీ తన కుమార్తెకు రెట్టింపు వయసున్న వ్యక్తి మాయ చేసి పెళ్లి చేసుకున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. వివాహాన్ని రద్దు చేయాలని కోర్టుకు వెళ్లగా… కోర్టు తండ్రి వాదనను తోసిపుచ్చింది.
ఎమ్మెల్యే దళితుడు కావడం, వధువు బ్రాహ్మణ అమ్మాయి కావడంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. సౌందర్య తండ్రి స్వామినాథన్ ఒక పూజారి కూడా కావడం వల్ల ఇది మరింత వైరల్ అయ్యింది. తన కుమార్తను ఎమ్మెల్యే అపహరించాడని స్వామినాథన్ వాదన. అయితే, కోర్టు వారిద్దరినీ పిలిపించింది. వారు మేజర్లు కావడం, సౌందర్య తన ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో కోర్టు నవ దంపతుల వివాహం చెల్లుతుంది అని వారికే మద్దతు పలికింది.
మద్రాస్ హైకోర్టు తీర్పు అనంతరం అమ్మాయి తండ్రి స్వామినాథన్ కన్నీరుమున్నీరయ్యారు. ఇపుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆందోళన కూడా కొందరికి ఉంది. అయితే, కూతురు సౌందర్య మాత్రం ప్రభును ప్రేమించానని, అతడిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని చెబుతోంది.