చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ గుర్తున్నాడా? తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో బాలనటుడిగా మాస్టర్ భరత్ మస్తు ఫేమస్. బొద్దుగా, ముద్దుగా ఉండే భరత్.. మూడేళ్ల వయసు నుంచే నటించడం మొదలుపెట్టారు. 2002లో ` నైనా` అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన భరత్.. `అంజి` మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. వెంకీ, హ్యాపీ, పోకిరి, ఢీ, దుబాయ్ శీను, రెడీ, బిందాస్ వంటి చిత్రాలతో మాస్టర్ భరత్ తెలుగువారికి చేరువయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్, అద్భుతమైన నటనతో ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.
సినిమాల్లోనే కాకుండా అనేక సీరియల్స్ లో కూడా యాక్ట్ చేసిన మాస్టర్ భరత్.. ఇప్పుడు చాలా పెద్దవాడు అయ్యాడు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఆ తర్వాత కాలంలో హీరో,హీరోయిన్లుగా మారుతుంటారు. అదే విధంగా భరత్ కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అల్లు శిరీష్ ‘ఎబిసిడి’ చిత్రంతో సెకండ్ హీరోగా నటించాడు. కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. అలాగే పలు చిత్రాల్లో సహాయక నటుడిగా కూడా పని చేశాడు.
అవకాశాలు రాకపోవడం వల్లనో లేక కోరుకున్న పాత్రలు దక్కకపోవడం వల్లనో తెలియదు గానీ.. కొంత కాలం నుంచి సినీ పరిశ్రమకు భరత్ దూరంగా ఉంటున్నాడు. సోషల్ మీడియాలో కూడా అడపా తడపా మాత్రమే కనిపించే భరత్.. ప్రస్తుతం ఎలా ఉన్నాడో చూస్తే షాకైపోతున్నారు. చిన్నతనంలో చాలా బొద్దుగా ఉన్న భరత్.. ఇప్పుడు సన్నగా, హ్యాండ్సమ్ గా మారిపోయాడు. హీరోలకు ఏ మాత్రం తీసిపోని కటౌట్ ను మెయింటైన్ చేస్తున్నాడు. కాగా, భరత్ సినిమాలు చేస్తూనే మెడిసిన్ కూడా పూర్తి చేశాడు.
View this post on Instagram