అగ్రరాజ్యం అమెరికా లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గన్ కల్చర్ ఎక్కువగా ఉండే ఆ దేశంలో.. రెండు గ్రూపుల మధ్య జరిగిన కాల్పులు.. ముగ్గురి ప్రాణాల్ని తీసింది. న్యూమెక్సికోలోని లాస్ క్రూస్ లో ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది.
మరణించిన ముగ్గురిలో ఇద్దరు టీనేజర్లు ఉన్నారని.. ఒకరు మేజర్ (19ఏళ్ల కుర్రాడు)గా చెబుతున్నారు. దాదాపు పదిహేను మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారంతా 16-36 ఏళ్ల మధ్య ఉంటారని పోలీసులు చెబుతున్నారు. కాల్పుల్లో గాయపడిన వారిని రెస్క్యూ చేసిన పోలీసులు వారిని ఆసుపత్రులకు తరలించారు. ఒక ఈవెంట్ లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.
సంగీత.. వినోద కార్యక్రమంలో జరిగిన ఈ హింసకు కారణమైన వారిని పట్టుకోవటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యక్ష సాక్ష్యులు.. ప్రజల సహాయాన్ని తీసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరి దగ్గరైనా వీడియోలు.. ఫోటోలు ఉంటే తమకు పంపితే.. తగు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. లాస్ క్రూసెస్ సిటీ సౌత్ లోని న్యూ మెక్సికోలోని రియో గ్రాండే నది వెంబడి చివాహువాన్ ఎడాది వద్ద అమెరికా – మెక్సికన్ సరిహద్దుకు ఉత్తరాన 66 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెబుతున్నారు. మెక్సికోలో ఈ తరహా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ ఏడాది జనవరిలోనూ ఆగ్నేయ మెక్సికోలోని విల్లాహెర్మోసా సిటీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అప్పట్లో ఏడుగురు ప్రాణాలు పోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మరిన్ని అందాల్సి ఉంది.