రాజకీయాల్లో ఒక్కొక్క సారి చోటు చేసుకునే పరిణామాలు.. చిత్రంగా ఉంటాయి. నాయకులను డోలాయ మానంలో పడేస్తాయి. దీంతో వారికి ముందుకు వెళ్లాలా.. వద్దా.. అనే విషయంపై తర్జన భర్జన కొనసాగు తుంటుంది. ఇప్పుడు ఇదే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకుడు.. మర్రి రాజశేఖర్. ఇదే విషయం చిలకలూరిపేట నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
ఆయనకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. తర్వాత.. ఎమ్మెల్సీ ఇస్తామని.. ఆశచూపారు. అది కూడా దక్క లేదు. అంతేకాదు.. మంత్రి అన్నారు. అసలు ఆ ఊసేలేకుండా పోయింది. అయితే..ఎట్టకేలకు.. ఆయన ను బుజ్జగించేందుకు .. ఇటీవల పార్టీ ఇంచార్జ్ పదవిని ఇచ్చారు. అయితే.. ఇది కూడా ఆయనకు ఎలాంటి ఆశించిన ప్రయోజనం చేకూర్చలేదు. అయితే.. పార్టీ అధినేతను మచ్చిక చేసుకునేందుకు ఆయన.. అనుచరులు.. ఒక కీలక సూచన చేశారని తెలిసింది.
అదేంటంటే.. ప్రస్తుతం సీఎం జగన్.. గడపగడపకు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో చురుగ్గా ఉన్నవారికి.. ప్రజల నుంచి మార్కులు పడుతున్న వారికి.. మాత్రమే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని.. చెప్పారు. సో.. ఇప్పుడు ఈ కార్యక్రమం మీరు నిర్వహించండి.. అనేది మర్రిపై వస్తున్న ఒత్తిడి. ఎందుకంటే.. చిలకలూరిపేట ఎమ్మెల్యే కమ్ మంత్రి విడదల రజనీ.. ఫుల్లు బిజీగా ఉంటున్నారు. దీంతో ఆమె నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించలేక పోతున్నారు.
ఈ గ్యాప్‌లో మీరు చేరిపోయి.. ప్రజలకు చేరువైతే.. మీకు మంచిమార్కులు పడితే.. రేపు మీరే టికెట్‌ను డిమాండ్ చేయొచ్చకదా.. అనేది మర్రి అనుచరుల వాదన. అదేసమయంలో కొందరు.. అవసరమైతే.. ఇండిపెండెంటుగా అయినా.. ప్రజల మధ్యకు వెళ్లేందుకు.. ఈ కార్యక్రమం దోహదపడుతుందని.. వారు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంలో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వెళ్లాలని ఉన్నా.. వెళ్తే.. ఏమవుతుందో.. అనే సంశయంలో ఉన్నారని సమాచారం. మరి ఏం చేస్తారో చూడాలి.