ఏపీ సీఎం జగన్.. తనసోదరి.. షర్మిల తెలంగాణలో పెట్టబోయే పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేద ని.. తాము అసలు పార్టీ ఏర్పాటు విషయంపై వద్దని కూడా చెప్పామని.. అయినా ఆమె తమ మాట వినకుం డానే పార్టీ పెట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆమె కష్టాలు ఆమె పడతారు!- అని సీఎం జగన్ పరోక్షంగా తన సలహాదారు.. పార్టీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డితో మీడియా ద్వారా ప్రజలకు చెప్పేశారు.
అయితే.. ఈ పరిణామం జరిగి.. రెండు రోజులు కూడా జరగకముందుగానే.. అనూహ్యమైన పరిణామం చో టు చేసుకుంది. జగన్‌కు అత్యంత విధేయుడు, వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న నాయకు డు షర్మిల, ఆమె భర్త అనిల్‌తో భేటీ కావడం దాదాపు గంటకు పైగా చర్చలు జరపడం సంచలనంగా మారింది.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతోను, అనిల్తోను తాజాగా భేటీ అయ్యారు. నేరుగా లోటస్ పాండ్‌కు వెళ్లిన.. ఆయన.. ఇద్దరితోనూ గంటకు పైగా చర్చలు జరిపారు. అధికారికంగా ఆయన ఏం మాట్లా డారనే విషయం తెలియకపోయినా.. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆయన రాయబారిగా వెళ్లి ఉంటారనేది మాత్రం నిజం అంటున్నారు పరిశీలకులు.
ఆది నుంచి వైఎస్ జగన్‌కు, షర్మిలకు సన్నిహితుడైన రామకృ ష్ణారెడ్డి.. తాజాగా చేసిన పర్యటనపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ విషయంలో వెనక్కి తగ్గాలని చెప్పి ఉంటారా? అంటే కొందరు ఔనని అంటున్నారు. మరికొందరు కాదని అంటున్నారు.
ఇంకా పార్టీ ఏర్పాటుపై షర్మిల ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో పార్టీ కాకుండా.. ఏదైనా.. సామాజిక సంస్థలాంటిది పెట్టుకుని ముందుకు సాగితే బెటర్ అని జగన్ నుంచి సలహా అంది ఉండాలని చెబుతున్నారు. కాదు.. ఒకసారి రాజన్న రాజ్యం తీసుకువస్తాను.. అని ప్రకటించిన తర్వాత.. వెనక్కి తగ్గేది లేదని షర్మిల కూడా పట్టుదలతోనే ముందుకు సాగుతానంటే.. ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్లాలి.. అనే అంశాలపై ఫీడ్ అయినా ఇచ్చి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక, పార్టీ ఏర్పాటు విషయంలో షర్మిల గట్టిపట్టుదలతోనే ఉన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని స్థాపించే విషయంలో ముందుకు పోతామని ఆళ్లతో షర్మిల స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తాను పెట్టే పార్టీపై జగన్ మద్దతు ఉంటుందని ఇప్పటికే షర్మిల చెప్పారు.
అయితే సజ్జల రామకృష్ణారెడ్డి.. మాకు సంబంధం లేదు.. ఆమెను పార్టీ పెట్టొద్దని కూడా చెప్పాం.. అని వెల్లడించిన దరిమిలా.. ఎవరి సహకారం లేకపోయినా.. తాను ఒంటరిగా అయినా.. నెగ్గుకురాగలననే ధీమాతో షర్మిల ఉండి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆళ్ల వెళ్లి.. షర్మిల దంపతులతో విడివిడిగా భేటీ కావడం అంటే.. జగన్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.