ఎస్ ఈసీ మ‌రో బ్రేకింగ్ డెసిష‌న్‌.. వైసీపీ ఎమ్మెల్యే వాయిస్ క‌ట్‌!

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకోవ‌ద్ద ని.. నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించ‌వ‌ద్ద‌ని.. ప‌దేప‌దే చెబుతున్నా.. అధికార పార్టీ నేత‌లు మాత్రం త‌మ దూకు డు త‌గ్గించ‌డం లేదు. అధికారుల‌ను బెదిరించే వారు కొంద‌రైతే.. మ‌రికొంద‌రు ఏకంగా క్షేత్ర‌స్థాయిలో అభ్య ‌ర్థుల‌ను బెదిరించేవారు క‌నిపిస్తున్నారు. దీంతో పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై అనేక అనుమానాలు వ‌స్తున్నాయి.

మ‌రోవైపు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు కూడా త‌గ్గిపోతున్నాయి. దీనిపై ప్రజ‌ల నుంచి అటు మేధావి వ‌ర్గాల నుంచి కూడా గ‌గ్గోలు పుడుతోంది అయినా.. అధికార పార్టీ నాయ‌కులు మాత్రం త‌మ పంథాను వీడ‌డం లేదు. కొన్నాళ్ల కింద‌ట‌.. చిత్తూరు, గుంటూరు పంచాయ‌తీల ఏక‌గ్రీవాల‌పై అధికారుల‌పై నోరు పారేసుకున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చం ద్రారెడ్డి. అధికారుల‌ను గుర్తు పెట్టుకుని మ‌రీ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

ఫ‌లితంగా ఎస్ ఈసీ ఝ‌ళిపించిన కొర‌డాతో కోర్టుకువెళ్లాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో హైకోర్టు కూడా ఎస్ ఈసీ నిబంధ‌న‌ల మేర‌కు న‌డుచుకోవాల‌ని చెప్ప‌క‌నే చెప్పింది. ఈ విష‌యం తెలిసి కూడా ఎమ్మెల్యే జోగి ర‌మేష్ త‌న పంథాను మార్చుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

రెండో ద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైన దరిమిలా.. నామినేష‌న్ల ఘ‌ట్టం జోరుగా సాగుతోంది. ఈ విష‌యంలో జోక్యం చేసుకున్న జోగి ర‌మేష్‌.. వైసీపీ మ‌ద్ద‌తు దారుల‌కు వ్య‌తిరేకంగా నామినేష‌న్లు దాఖ‌లు చేసేవారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు క‌ట్ చేస్తామ‌ని బ‌హిరంగంగా వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది.

దీనిపై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఫిర్యాదు చేసింది. దీంతో వెంట‌నే స్పందించి న ఎస్ ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌.. ఈ నెల 17 వ‌ర‌కు జోగి ర‌మేష్ మీడియాతో మాట్లాడ‌రాద‌ని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఈ ఆదేశాలు వెంట‌నే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని కూడా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఇది వైసీపీలో సంచ‌ల‌నంగా మారింది.

ఒక‌వైపు ఎస్ ఈసీ ఆదేశాల దెబ్బ‌తో సీనియ‌ర్ మంత్రి పెద్దిరెడ్డే చెమ‌ట‌లు క‌క్కుకుంటే.. ఎమ్మెల్యే జోగి ర‌మేష్ అన్నీ తెలిసి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఏం స‌మంజ‌సం అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.