కొద్దిరోజుల క్రితం మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న విభేదాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు, మోహన్ బాబు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం, ఒకరికి పోటీగా ఒకరు బౌన్సర్లను దింపడం, క్షణికావేశంలో ఓ టీవీ రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి చేయడం ఇలా అనేక అంశాలు చోటు చేసుకున్నాయి. మంచు ఫ్యామిలీ ఇమేజ్ మొత్తం డామేజ్ అయింది.
ఇక ఇదే తరుణంలో తన ఇంటి జనరేటర్ లో విష్ణు పంచదార పోయించి కరెంట్ లేకుండా ఇబ్బందులకు గురి చేశాడంటూ మనోజ్ ఆరోపణలు చేయడం మరొక హైలెట్. అయితే తాజాగా జనరేటర్ లో పంచదార ఇష్యూ పై మంచు విష్ణు స్పందించాడు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `కన్నప్ప` తుది దశకు చేరుకుంది. ఈ మూవీ టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా విష్ణు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు.
అయితే కొందరు సినిమాకు సంబంధించిన విషయాలు అడితే.. మరికొందరు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రశ్నలు సంధించారు. అన్నింటికి విష్ణు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ `రా అన్న కూడా మంచి రిప్లై ఇచ్చే మనసు నీది. మరి ఆ రోజు జనరేటర్ లో షుగర్ ఎందుకు పోసావ్ అన్న?` అని ప్రశ్నించాడు. అందుకు విష్ణు `ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్ లో చదివా..` అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం విష్ణు సమాధానం నెట్టింట వైరల్‌గా మారింది.