మంచు మనోజ్ గురించి ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. తాజాగా ఆయన హైదరాబాద్ సీతాఫల్ మండిలో ఓ వినాయక మండపానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ తో పాటు దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డి పూజల్లో పాల్గొనడం గమనార్హం. ఇది సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారనే ప్రచారం మొదలైపోయింది.
అయితే ఈ పెళ్లి విషయంపై మంచు మనోజ్ ను అడగ్గా నో కామెంట్ అని స్పందించడం ఇక్కడ గమనార్హం. కొట్టిపారేయకుండా టైం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతానని ఆయన పేర్కొనడం విశేషం. మంచు మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ 2019లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటి నుంచి ఆయన ఒంటరిగా ఉంటున్నారు.