కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఏకైక కుమార్తె, నటి మంచు లక్ష్మి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నటిగానే కాకుండా యాంకర్ గా, నిర్మాతగానూ మంచు లక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళ్, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో ఇరవైకి పైగా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటేందుకు హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చింది. మంచు లక్ష్మి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2006లో ఆమె ఐటీ ప్రొఫెషనల్ ఆండీ శ్రీనివాసన్ను వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ఈ దంపతులు సరోగసీ ద్వారా ఒక కుమార్తెకు కూడా జన్మించారు.
అయితే పెళ్లైన కొన్నేళ్లకు మంచు లక్ష్మి ఇండియా వచ్చేయగా.. ఆమె భర్త అమెరికాలోనే ఉంటూ బిజినెస్ చూసుకుంటున్నారు. ముఖ్యమైన సందర్భాల్లోనే మాత్రమే వీరు మీట్ అవుతుంటారు. ఇప్పటికీ ఇదే కొనసాగుతోంది. అయితే భర్తకు దూరంగా ఉండటం పట్ల మంచు లక్ష్మి చాలా విమర్శలను ఎదుర్కొంటారు. ఒకానొక సమయంలో మంచు లక్ష్మి, ఆండీ శ్రీనివాసన్ విడాకులు తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇంతవరకు లక్ష్మి ఎక్కడా ఈ విషయంపై ఓపెన్ కాలేదు.
కానీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో భర్తకు దూరంగా ఉండటంపై రియాక్ట్ అయిన మంచు లక్ష్మి ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిజానికి తాము ఎంతో అన్యోన్యంగా ఉన్నామని.. సమాజంలో ఉన్న ధోరణిలా కాకుండా ఎవరికి వారు ప్రశాంతంగా బతికేలా, స్వేచ్ఛను ఇచ్చిపుచ్చుకుంటామని మంచు లక్ష్మి తెలిపింది. కోవిడ్ తర్వాత తమలో చాలా మార్పు వచ్చిందని.. స్వేచ్ఛ, ప్రైవసీ, పర్సనల్ రెస్పాన్సిబిటీ లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సమయం దొరికినప్పుడల్లా కలుస్తుంటామని వివరించింది. రీసెంట్ గా రెండు నెలలు భర్తతోనే తాను కలిసి ఉన్నానని.. ప్రస్తుతం మా పాప ఆయన వద్దే ఉందని మంచు లక్ష్మి తెలిపింది. తామెంతో సంతోషంగా ఉన్నామని.. మీరు మమ్మల్ని విడగొట్టదంటూ ట్రోలర్స్ కు మంచు లక్ష్మి గట్టి కౌంటర్ ఇచ్చింది.