మారుతి మళ్లీ లైన్లోకి వచ్చాడు.
కామెడీని వదిలేస్తే తనకు బ్యాండ్ తప్పదని… తనదైన కామెడీని పండిస్తూ మొదలెట్టాడు
సంతోష్ శోభన్, మెహ్రీన్ లతో మంచి రోజులొచ్చాయి అంటూ మన ముందుకు వస్తున్నాడు.
కరోనా పోయాక తనకు మంచిరోజులు వచ్చాయంటున్నాడో మనకు మంచి రోజులు వచ్చాయంటున్నాడో ఏమో మరి.
ఏదైతేనేం… చమత్కారమైన కామెడీతో పాటు రొమాన్స్‌ని మిక్స్ చేస్తూ మంచి ట్రైలర్ వదిలాడు.
ట్రైలర్ బాగుంది. సినిమా కూడా ఇదే రూట్లో నడిస్తే హిట్టు గ్యారంటీ.
వెన్నెల కిషోర్, సప్తగిరి, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్, అజయ్ ఘోష్ మరియు ప్రవీణ్ వీరందరినీ చూస్తుంటే భారీ హాస్య తారాగణం ఉందీ సినిమాలో. చూస్తుంటే మంచి ఎంటర్టైన్ మెంట్ ప్యాకేజీని సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది.
దీపావళి వీకెండ్ సందర్భంగా నవంబర్ 4న మంచి రోజులొస్తున్నాయట.
4 కోట్ల బడ్జెట్‌తో 29 రోజుల్లో వేగంగా తీసిన సినిమా ఇది.