దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. పేరు మోసిన జాతీయ మీడియాకు చెందిన సర్వే సంస్థలు మొదలు ఛోటా మోటా సర్వే ఏజెన్సీల వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఈ క్రమంలోనే మెజారిటీ సర్వే సంస్థలు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందని తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో వెల్లడించాయి. మరికొన్ని సంస్థలు మాత్రం వైసీపీ మరోసారి అధికారం నిలబెట్టుకుంటుందని అభిప్రాయడ్డాయి. దాదాపు 20 సర్వే సంస్థల ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే వాటిలో 18 వరకూ ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నాయి. కొన్ని సంస్థలు వైసీపీ గెలుస్తుందని అభిప్రాయపడ్డాయి.
ఈ క్రమంలోనే ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు యథాతధంగా…
ఇండియా టుడే- లోక్ సభ – వైసీపీ 3-5, కూటమి 19-23
పీపుల్స్ పల్స్- వైసీపీ 45-60 టీడీపీ 95-110 జనసేన 14-20, బీజేపీ 2-5
రైజ్- 48-66 టీడీపీ 92-99 జనసేన 11-16
ప్రిజమ్- వైసీపీ 60, కూటమి 110
సర్వే ఫ్యాక్టరీ- వైసీపీ 64, కూటమి 111
జన్ మత్ పోల్స్- వైసీపీ 95-103 కూటమి 67-75
అగ్ని న్యూస్- వైసీపీ 124-128, కూటమి 46-49
ఆరా మస్తాన్- వైసీపీ 94-104, కూటమి 71-81, లోక్ సభ- వైసీపీ 13-15, టీడీపీ 10-12
పల్స్ టుడే- వైసీపీ 46-54, కూటమి 121-129, లోక్ సభ వైసీపీ 5-6, కూటమి 19-20
చాణక్య స్ట్రాటజీస్- వైసీపీ 39-49, 114-125 లోక్ సభ వైసీపీ 6-7,కూటమి 17-18
పార్థా దాస్ చాణక్య పొలిటికల్ కన్సల్టెన్సీ – వైసీపీ 110-120, కూటమి 55-65