అనకాపల్లిలో అత్యంత ఘోర ప్రమాదం జరిగింది. బ్రిడ్జి పనుల్లో లోపం కారణంంగా బ్రిడ్జి లాంగ్ బీమ్ లు వాహనాలపై విరిగిపడి ఇద్దరు అక్కడికక్కడే క్షణాల్లో చనిపోయారు.
అనకాపల్లి జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అవి అత్యంత బరువైన బ్రిడ్జి బీమ్ లు కావడంతో స్థానికంగా అందుబాటులో ఉన్న క్రేన్ల శక్తి సరిపోలేదు.
దీంతో విశాఖపట్నం నుంచి భారీ క్రేన్లను తెప్పించి సహాయక చర్యలు చేపట్టాల్సి రావడం వల్ల మృతదేహాలను బయటకు తీయడం కూడా కష్టమైపోయింది.
ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఒక లారీ పూర్తిగా ధ్వంసం అయ్యింది. చాలామంది గాయపడ్డారు.
పిలర్లు కులుతున్న సమయంలో పెద్ద శబ్దాలు రావడంతో అటు ఇటు ప్రయాణిస్తున్న వారు బ్రేకులు వేసి తప్పించుకోగలిగారు. అక్కడే ఉన్న వారు పరుగులు తీశారు.