ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న కలల కాంబినేషన్ త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి ఓ సినిమా చేయబోతున్నాడు.
ఈ కాంబినేషన్లో సినిమా కోసం దశాబ్దం కిందటే ప్రయత్నాలు జరిగాయి. కలిసి సినిమా చేయడానికి ఇద్దరూ ఆసక్తిని ప్రదర్శించారు. కానీ రకరకకాల కారణాల వల్ల అది సాధ్యపడలేదు.
ఐతే ఎట్టకేలకు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేష్‌తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశాడు జక్కన్న. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాడు.
తనకు చాలా ఏళ్ల నుంచి కమిట్మెంట్ ఉన్న సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ ప్రొడక్షన్లో రాజమౌళి ఈ సినిమా చేయబోతున్నాడు.
ఐతే మహేష్-రాజమౌళి సినిమా కథ నేపథ్యం గురించి కొన్ని నెలలుగా ఆసక్తికర ప్రచారం నడుస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఐతే నిర్మాత నారాయణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా కథ బ్యాక్ డ్రాప్ ఏంటో తనకు కూడా తెలియదని, మీడియాలో వస్తున్నవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారు. దీంతో ఈ ప్రచారానికి తెరపడిరది.
కానీ ఇప్పుడు స్వయంగా రాజమౌళి తండ్రి, ఈ చిత్రానికి కథ రాస్తున్న విజయేంద్ర ప్రసాదే ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్ గురించి మాట్లాడటం విశేషం.
మహేష్‌తో రాజమౌళి చేయాల్సిన సినిమాకు కథ ఇంకా సిద్ధం కాలేదని.. కథా చర్చలు నడుస్తున్నాయని విజయేంద్ర ఓ ఇంటర్వ్యూలో వెల్లడిరచారు. ఐతే రెండు రకాల కథల మీద పని చేస్తున్నామని.. అందులో ఒక కథ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో నడిచేదే అని విజయేంద్ర చెప్పడం విశేషం. త్వరలో కథపై ఓ నిర్ణయానికి వస్తామని ఆయన చెప్పారు.
ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్లు చేసే మహేష్‌ను రాజమౌళి సినిమాలో కొంచెం రఫ్‌గా చూడాలని, జక్కన్న స్టయిల్లోనే వయొలెంట్‌గా కనిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ మాటల్ని బట్టి చూస్తే అభిమానుల ఆకాంక్షలు నెరవేరేలాగే కనిపిస్తాయి.
ఆఫ్రికా అడవుల నేపథ్యం తీసుకుంటే మహేష్‌కు కచ్చితంగా ఇదొక డిఫరెంట్.. అడ్వెంచరస్ ఫిలిం అవుతుందనడంలో సందేహం లేదు. మరి అందరు స్టార్లకూ ఇచ్చినట్లే మహేష్‌కు కూడా జక్కన్న బ్లాక్‌బస్టర్ ఇస్తాడేమో చూడాలి.