షూటింగ్స్ లో ఎంత బిజీ ఉన్నప్పటికీ ఏడాదిలో కనీసం నాలుగైదు సార్లు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లడం మహేష్ బాబును ఉన్న అలవాటు. అయితే దర్శకధీరుడు రాజమౌళితో సినిమా ప్రారంభం అయ్యాక ఆయన పాస్‌పోర్ట్‌ను జక్కన్న తీసేసుకున్న సంగతి తెలిసిందే. పాస్‌పోర్ట్ లాక్కుని సింహాన్ని లాక్ చేశానంటూ సింబాలిక్‌గా జక్కన్న ఇటీవల ఒక వీడియోను కూడా వదిలారు. దీంతో జైల్లో పడ్డ ఖైదీలా మహేష్ బాబు పరిస్థితి మారిందంటూ కొందరు సరదాగా మీమ్స్ కూడా క్రియేట్ చేశారు.
అయితే తాజాగా సింహానికి పాస్‌పోర్ట్ రిటర్న్ ఇచ్చారు జక్కన్న. `ఎస్ఎస్ఎంబీ 29` ఫస్ట్ షెడ్యూల్‌ను రీసెంట్ గానే కంప్లీట్ అయింది. ఒరిస్సాలో తొలి షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ జరిగింది. రెండో షెడ్యూల్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉండటంతో మహేష్ బాబుకు పాస్ట్‌పోర్ట్ ఇచ్చి ఎంజాయ్ చేయమంటూ ఫ్రీడమ్ ఇచ్చారు రాజమౌళి. ఇక జక్కన్న వరం ఇవ్వడమే ఆలస్యం.. మహేష్ బాబు వెకేషన్ ను పరుగులు పెట్టాడు.
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కూతురు సితారతో కలిసి ప్రిన్స్ దర్శనమిచ్చాడు. అక్కడే కొందరు ఫోటోగ్రాఫర్స్ ఉండటంతో మహేష్ బాబు వెంటనే తన పాస్‌పోర్ట్ చూపించి నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మహేష్ ఫేస్‌లో ఆనందం చూసి ఫ్యాన్స్ కూడా చిల్ అవుతున్నారు. `సక్సెస్‌ఫుల్‌గా పాస్‌పోర్ట్ కొట్టేశాం.. ఇక మనల్ని ఎవడ్రా అపేది` అంటూ కొందరు నెటిజన్లు మహేష్‌ను ఉద్ధేశించి కామెడీగా కామెంట్స్ పెడుతున్నారు. కాగా, ఎస్ఎస్ఎంబీ 29 సినిమా విషాయినికి వస్తే.. రాజమౌళి, మహేష్ కాంబోలో వస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇది. ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కనిపించబోతుంది. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
— oærmy (@ssmbbakthudu) April 5, 2025