టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. విజన్ 2020 పేరుతో 20 ఏళ్ల క్రితమే భవిష్యత్తును చూడగలిగిన దార్శనీకుడు చంద్రబాబు అని పలువురు రాజకీయ దిగ్గజ నేతలు సైతం కొనియాడారు. గొప్ప విజనరీ చంద్రబాబు నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని కూడా ఈ రోజుకీ వైసీపీ ప్రభుత్వం దాష్టీకాలను ఎండగడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్న అసలుసిసలు నాయకుడు చంద్రబాబు.
ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడుపై సీనియర్ జర్నలిస్ట్ పూల విక్రమ్ ‘మహా స్వాప్నికుడు’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడలో ఆ పుస్తకాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ గౌడ ఆవిష్కరించబోతున్నారు. కువైట్ లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు వెంకట్ కోడూరి ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకంలో చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసం మొదలు ఈ రోజు రాజకీయాల వరకు అనేక విషయాలను ప్రస్తావించారు. ఇక, చంద్రబాబుపై జరుగుతున్న దృష్ప్రచారంపై కూడా వాస్తవాలను ఈ పుస్తకంలో వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.