మే 11 -15 వరకు, అమెరికా లో సెయింట్ లూయిస్ లో ఉన్న హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ దేవాలయం మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నారు. 30 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న ఈ దేవాలయానికి ప్రాణ ప్రతిష్ఠ (మొదటి కుంభాభిషేకం) 1998 లో , రెండవ కుంభాభిషేకం 2009 లో జరిగాయి.
శ్రీ రామకృష్ణ నారాయణం గారి (కొలంబస్, ఒహాయో) ఆధ్వర్యo లో, 15 కు పైగా రిత్విక్కులు తో శాస్త్రోక్తం గా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఛైర్మన్ శ్రీనివాస రజనీకాంత్ గంగవరపు, ప్రెసిడెంట్ శ్రీమతి రాజ్యలక్ష్మి నాయుడు ఆధ్వర్యం లో 400 లకు పైగా వాలంటీర్ల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని భక్తుల అవసరాలు దృష్టిలోపెట్టుకుని రూపొందిస్తున్నారు.
చక్కటి అలంకరణలతో దేవాలయ ప్రాంగణమంతా ముస్తాబు చేసారు. పూజాక్రతువులతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను రంజింప చేయనున్నాయి.
మహాకుంభాభిషేకం అనంతరం ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసులు పద్మ విభూషణ్ శ్రీ ఏసుదాసు, పద్మ భూషణ్ శ్రీమతి సుధా రఘునాధన్ గాత్ర కచేరీలు భక్తులను అలరించనున్నాయి.