ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా మాజీ మంత్రి, జగన్కు మామ వరుస అయ్యే బాలినే ని శ్రీనివాసరెడ్డి వరుస పెట్టి.. వీధినపడ్డారు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని.. పనిగట్టుకుని కొందరు .. తనను డైల్యూట్ చేస్తున్నారని.. లేనిపోని విషయాలకు తన పేరు జోడించి ఇబ్బందులు పెడు తున్నారని.. కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన అధిష్టానం ఇప్పటకైనా పట్టించుకోవాలని అన్నారు.
అయితే.. ప్రకాశం విషయాన్ని చూసుకుంటే.. బాలినేనిని ఎదరించే నాయకులు ఎవరు ఉన్నారు? ఇది ఎవరికి సాధ్యం? అనే విషయాలు చూస్తే.. దాదాపు అందరూ ఆయన కనుసన్నల్లోనే ముందుకు సాగుతు న్నారు. ఒకరిద్దరు తప్ప. అయితే.. వారు కూడా బాలినేనిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. చేయరు కూడా. సో.. బాలినేని ఉద్దేశం ప్రకారం.. ఒంగోలు ఎంపీనే తనను టార్గెట్ చేస్తున్నారనే ఆయన భావన. ఆది నుంచి కూడా ఎంపీ మాగుంట శ్రీనివాసులుతో బాలినేని అస్సలు పడడం లేదు.
పార్టీలోకి రావడాన్ని కూడా ఆయన ఆక్షేపించారు. ఇక, ఒంగోలు టికెట్ తెచ్చుకోవడం.. అనంతరం మాగుంట గెలవడం అందరికీ తెలిసిందే. అయితే.. ఇంత జరిగినా.. నెంబర్ 2 నాయకుడు అవుతారనే ఉద్దేశమో.. లేక అధిష్టానం దగ్గర తన కన్నాదూకుడు ప్రదర్శిస్తారని అనుకున్నారో. తెలియదు కానీ.. పార్టీలో మాగుంటకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ముఖ్యంగా బాలినేని వర్గంగా ఉన్న చాలా మంది నాయకులు మాగుంటను దూరం పెట్టారు.
గత ఏడాది కిందట కరోనా ఆనందయ్య మందు వచ్చినప్పుడు కూడా మాగుంటకు దక్కకుండా… బాలినేని వర్గమే అంతా కొనేసింది. దీంతో ఆనందయ్యను కలిసి.. తనకోసం ప్రత్యేకంగా మందును తయారు చే యించుకుని పంచాల్సిన పరిస్థితి వచ్చింది. అదేసమయంలో ముఖ్యమంత్రి పర్యటన సమయంలోనూ.. మాగుంటకు ప్రాధాన్యం లేకుండా చేశారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన విసిగిపోయి.. వైసీపీ నేతలకు దూరంగా ఉంటున్నారనేది జిల్లా టాక్.
ఈ నేపథ్యంలోనే ఆయన పక్క చూపులు చూస్తున్నారనేది వాస్తవమేనని పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. తనను గుర్తించనప్పుడు.. తాను ఎందుకు పార్టీలో ఉండాలనేది ఎంపీ ఉద్దేశం అయితే.. అయి ఉండొచ్చు. పైగా మంత్రిగా ఉన్న బాలినేని కూడా అందరినీ కలుపుకొని ముందుకు సాగకుండా.. కొందరివాడిగానే ముద్ర వేసుకున్నారు. ఈ పరిణామమే ఆయనకు పదవి పోయేలా చేసిందనే టాక్ కూడా ఉంది. మరి ఇన్ని తప్పులు మనవైపు పెట్టుకుని.. ఎవరో ఏదో చేస్తున్నారని.. మాజీ మంత్రి బాధపడే కన్నా.. మనల్ని మనం మార్చుకుంటే బాగుంటుందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.