రాజకీయాల్లో పార్టీ లు మారడం.. ఒక పార్టీ టికెట్‌పై గెలిచి .. మరో పార్టీ పంచన చేరడం వంటివి కామనే. అయితే.. ఇది అన్ని సందర్భాల్లోనూ క్లిక్ అయినా.. తర్వాత ఫ్యూచర్ ఏంటనేది కూడా ఇంపార్టెంటే. కొందరు ఇలా పార్టీలు మారి.. సక్సెస్ అయిన నాయకులు, సీఎంలు అయిన నాయకులు కూడా ఉన్నారు. కానీ, కొందరి విషయంలో మాత్రం.. ఇలా జరిగే పరిస్థితి లేదు. దీనికి ఉదాహరణే గుంటూరు వెస్ట్ నియోకవర్గం నుంచి గెలిచిన గిరి ధర్.
గిరి ధర్.. 2019 ఎన్నికల్లోటీడీపీ తరఫున విజయం దక్కించుకున్నారు. తర్వాత.. కొన్నాళ్లకే ఆయన పార్టీ మారి.. వైసీపీకి మద్దతు పలికారు. వ్యాపారాలు, కాంట్రాక్టులు దక్కించుకున్నారని .. అప్పట్లో చర్చ సాగింది. అయితే.. ఆయన పార్టీ మారడంతో .. రాజకీయంగా ఆయన సంపాయించుకున్న క్రెడిబిలిటీ మొత్తం కొలాప్స్ అయిపోయిందని అంటున్నారు ఆయన అనుచరులు. ఇప్పుడు ప్రజల్లోనూ.. మరోవైపు వైసీపీలోనూ గిరి మాట ఎక్కడా వినిపించడంలేదు.
టీడీపీలో ఉన్న గిరిని.. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేయి పట్టుకుని మరీ వైసీపీ వైపు అడుగులు వేయించారు. అయితే.. ఇప్పుడు ఆయనకుటికెట్ దక్కలేదు. ఇదే విషయాన్ని తాజాగా గిరి రహస్యంగా వెలంపల్లిని కలిసి.. విన్నవించారు. నువ్వు రమ్మంటే వచ్చాను.. ఇప్పుడు నా టికెట్ ఏంటి? అని ప్రశ్నించారు. దీంతో వెలంపల్లి కూడా.. టికెట్ ప్రయత్నాలు చేశారు. కానీ, అధిష్టానం నుంచి ఏమాత్రం స్పందన రాలేదు. దీంతోగిరికి టికెట్ లేదనే విషయం కన్ఫర్మ్ అయిపోయింది.
ఇప్పుడు గిరి టీడీపీలోకి వెళ్లాలని అనుకున్నా.. అవకాశం లేదు. టీడీపీ తరఫున వెస్ట్‌లో అభ్యర్థి ఉన్నారు. ఆయనను కాదని గిరిని చేర్చుకునే అవకాశం లేదు. పైగా.. పార్టీ విశ్వసనీయతనే గిరి దెబ్బ తీశారని.. చంద్రబాబు భావిస్తున్నారు. ఇక, జనసేన కూడా అంతే. టీడీపీ వద్దన్న వారిని చేర్చుకునే పరిస్థితి ఇక్కడ కూడా లేదు. దీంతో గిరి రాజకీయాలు .. ఇక ముగిసిపోయినట్టేనని అంటున్నారు పరిశీలకులు. అదే టీడీపీలో ఉండి ఉంటే.. టికెట్ ఆయనకే దక్కి ఉండేదని చెబుతున్నారు. ఏదేమైనాచేతులా చేసుకున్న ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారని టీడీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.