మూవీ ఆర్టిస్టు ఎన్నికలు ఎపుడూ ఆసక్తి కరమే.
కానీ ఈసారి మాత్రం వివాదాస్పంద కూడా అయ్యాయి.
సినిమాలో అనైక్యతను బట్టబయలు చేశాయి.
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించడం విశేషం.
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.
ఎపుడూ లేని విధంగా అత్యధికంగా పోలింగ్ నమోదైంది.
మొత్తం 883 మంది ఓటు హక్కు ఉన్న సభ్యులుండగా 665 ఓట్లు నమోదు అవడం రికార్డ్.
అయితే ఈసారి పలువురు ఓటు వేయకపోవడం గమనార్హం.
ఎవరెవరు ఓటు వేయలేదంటే…
వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రానా, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సుధీర్ బాబు, నాగ చైతన్య, రామ్ , నితిన్ ఓటు వేయలేదు.
హీరోయిన్లలో సమంత, హన్సిక, అనుష్క , త్రిష వంటి స్టార్ హీరోయిన్లు తమ ఓటు వేయలేదు.
ఇదిలా ఉంటే అనసూయ ట్విస్ట్ ఇచ్చింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పోటీ చేసిన అనసూయ ఓటింగ్ కి రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
చివరి నిమిషంలో అనసూయ తన ఓటు హక్కుని వినియోగించుకుంది.