శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’
ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేసే ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కించారు.
అక్కినేని నాగ చైతన్య… సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమా నాగ చైతన్యకు చాలా కీలకమైనది.
సారంగదరియా పాట ఈ సినిమాలోనిదే. ఈ పాట పుణ్యమా అని ఈ సినిమాకు కనీవినీ ఎరుగని హైప్ క్రియేట్ అయ్యింది.
కథ:
ఆర్మూర్ (నిజామాబాద్) గ్రామానికి చెందిన రేవంత్ (నాగ చైతన్య) మరియు మౌనిక (సాయి పల్లవి), హైదరాబాద్లో పెద్ద కలలతో జీవనం గడుపుతుంటారు. సాఫ్ట్ వేర్ జాబ్ దొరక్క ఇద్దరు.. రేవంత్ జుంబా డ్యాన్స్ అకాడమీలో డ్యాన్స్ ట్రైనర్ ఉద్యోగంలో చేరుతుంది మౌనిక. వారిద్దరు ప్రేమలో పడతారు. రేవంత్, ఒక దళిత క్రైస్తవుడు మరియు మౌనిక పటేల్ సామాజిక వర్గం. సహజంగానే సనాతన కులాచారాలు వారి పెళ్లి కలను భగ్నం చేయాలని ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో జరిగే సంఘటనల సమాహారమే సినిమా.
మనలాంటి వాళ్ళ కోసమే ఉంది మౌని ఈ World. కులం, మతం అని కొట్టుకు సచ్చే బట్టెబాస్గల్లా కోసం కాదు. #Lovestory
— Puta Madre (@Harid5651) September 24, 2021
పబ్లిక్ టాక్ ఏంటి?
డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈసారి సంక్లిష్టమైన కథను ఎంచుకున్నాడు, గ్రామీణ తెలంగాణ సమాజంలో కుల-ఆధారిత పేద సంపన్న వ్యత్యాసాలను వీలైనంతగా చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో కొన్ని సీన్లు చూస్తే శేఖర్ కమ్ములు చాలా ధైర్యం చేసి ఈ సబ్జెక్ట్ ను టచ్ చేశాడనిపిస్తుంది. అవి వివాదాస్పదం కాకుండా జాగ్రత్త పడ్డాడు. నాగ చైతన్య బానే న్యాయం చేశాడని చెప్పాలి. సాయిపల్లవి, ఆమె తల్లి పాత్ర బాగా తెరకెక్కించారని చెప్పాలి.
ప్రథమార్ధంలో మంచి హై ఇచ్చి.. ద్వితీయార్ధంలో ఆ టెంపోను కొనసాగించలేక ఇబ్బంది పడుతుంటాడు శేఖర్. అది ఈ సినిమాలోను రిపీటైంది. లవ్ స్టోరీ అని అందమైన పేరున్న ఈ సినిమా వాస్తవానికి ఆసక్తికరమైన చిత్రమే గాని వినోదాత్మక రూట్లో తీయలేదు. అయినా ఫస్ట్ హాఫ్ అలరిస్తుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్ ఉన్నాయి.
మౌనిక ఫ్లాష్ బ్యాక్ కొందరికి జీర్ణం కాదు. సమాజంలోని చీకటి కోణాలను వివాద రహితంగా టచ్ చేయడానికి శేఖర్ కమ్ముల చేసిన ప్రయత్నాన్ని అభినందించొచ్చు.
బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ కాబట్టి ఈ సినిమా పాటల గురించి చెప్పుకోవాలి. సంగీత దర్శకుడు పవన్ అద్భుతమైన పని చేసారు. ‘ఏవో ఏవో కళలే’ నిలుస్తుంది, ‘విన్నర్ విన్నర్ బ్రో’ బాగున్నాయి. ‘నీ చిత్రమ్ చూసి’ ‘సారంగ దరియా’ పాట-డ్యాన్స్ సీక్వెన్స్ బాగున్నాయి.
ఈ సినిమాకు బ్యాడ్ పాయింట్ అనవసరంగా విలన్ ను పెట్టడం. ఈ సినిమాకు కులం అనే ఒక విలన్ ఉన్నపుడు ప్రత్యేకంగా విలన్ పాత్ర పెట్టడం ఏమీ బాలేదని పబ్లిక్ ఒపీనియన్.
It was good movie.. I loved it.. climax could be much more better…when u r watching a movie which is discussing about current issue definitely we will expect very good ending.. #LoveStory https://t.co/ICMl0MS9n2
— ఋతు ???? (@serialsstar) September 24, 2021