భారత్ – ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరుగుతున్న వేళ.. ఎప్పుడూ కనిపించని కొత్త సీన్ ఒకటి చోటు చేసుకుంది. క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ లవ్ ఎపిసోడ్ అందరిని ఆకర్షించటమే కాదు.. కామెంటేటర్లు సైతం ఎంతో ఆసక్తిగా చూడటం గమనార్హం. రెండో వన్డేలో కష్టాల్లో ఉన్న జట్టును కాపాడేందుకు కోహ్లి.. శ్రేయస్ తెగ కష్టపడుతున్నవేళ.. స్టేడియంలోని స్టాండ్స్ లో అందుకు భిన్నమైన సీన్ ఒకటి కనిపించింది.
భారత్ అబ్బాయి ఒకరు.. ఆస్ట్రేలియా అమ్మాయికి లవ్ ప్రపోజల్ చేయటం.. అందుకు ఆమె ఓకే అనటంతో అక్కడున్న వారంతా ఆనందంతో చప్పుట్లు కొట్టేశారు. ఆస్ట్రేలియా అమ్మాయి.. భారత్ అబ్బాయి స్నేహితులు. ఇద్దరు మ్యాచ్ చూసేందుకు వచ్చారు. బారత్ అబ్బాయి టీమిండియా జెర్సీ ధరిస్తే.. ఆస్ట్రేలియా అమ్మాయి.. ఆసీస్ జెర్సీని ధరించింది. ఇద్దరూ స్నేహితులే అయినా.. వారిద్దరు తమ దేశ జట్లు గెలవాలంటూ కోరుకుంటున్నారు.
ఓపక్క మ్యాచ్ జరుగుతున్న వేళ.. ఇండియా కుర్రాడు.. మోకాళ్ల మీద కూర్చొని చేతిలో ఉంగరాన్ని ఆస్ట్రేలియా అమ్మాయికి చూపించి.. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. దీంతో.. ఆ అమ్మాయి ఆశ్చర్యంలో మునిగిపోయింది. అంతలోనే తేరుకొని ఓకే చెప్పింది. స్టేడియంలోని స్టాండ్స్ లో జరుగుతున్న ఈ తతంగాన్ని కెమేరా రికార్డు చేసింది. ఆ అబ్బాయి ప్రపోజల్ కు ఆ అమ్మాయి ఏమంటుందన్న విషయాన్ని మ్యాచ్ వ్యాఖ్యతలుగా వ్యవహరిస్తునన షేన్ వార్న్.. మెక్ గ్రాత్ సైతం ఆసక్తిగా చూశారు.
అబ్బాయి ప్రపోజల్ కు ఆ అమ్మాయి ఓకే చెప్పిన తర్వాత.. వ్యాఖ్యతలు.. ‘‘ఆమె ఓకే చెప్పింది’’ అంటూ వారిద్దరిని ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. స్టేడియంలోని భారీ ఎల్ ఈడీ స్క్రీన్ మీద ఆ జంటను ప్రదర్శించారు. ఆ జంటను మ్యాక్స్ వెల్ అభినందించారు. ఈ లవ్ ప్రపోజల్ అందరిని విపరీతంగా ఆకర్షించింది.