ప్రపంచంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దేవాలయంలో స్వామివారి ప్రసాదమైన లడ్డూకు ఉండే ప్రత్యేకత.. దానికి భక్తుల్లో ఉండే నమ్మకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి స్వామివారి లడ్డూలో ఉపయోగించే నెయ్యికి బదులుగా.. కాసుల కక్కుర్తితో పంది కొవ్వు.. గొడ్డు కొవ్వు.. చేప కొవ్వుతో కూడిన తక్కువ రకం నెయ్యిని వాడారా? అన్నదిప్పుడు భక్తులు ప్రశ్నగా మారింది.
దీనికి సంబంధించి వస్తున్న రిపోర్టులు కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దెబ్బ తీయటమే కాదు.. తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న పరిస్థితి.
గుజరాత్ కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్టు కాఫ్ లిమిటెడ్ సంస్థ పేర్కొన్న సందేహాల్ని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు పలువురు ప్రస్తావిస్తూ.. ఆ రిపోర్టులను బయటపెట్టారు. అంతేకాదు.. ఆ నివేదిక కాపీలను మీడియాకు విడుదల చేశారు.
స్వామివారి ప్రసాదమైన లడ్డూలో నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువ కంటే పరీక్షించిన నమూనాల్లో చాలా తేడాలు ఉన్నట్లుగా టీడీపీ పేర్కొంది. ఒక్కోనమూనాను ఐదు ఈక్వేషన్స్ తో పరీక్షించారని.. వాటన్నింటిలోనూ ఉండాల్సిన ప్రమాణాల కంటే ఎక్కవ లేదంటే తక్కువగా ఎస్ విలువ ఉందని తేల్చారు.
కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత లడ్డూల్లో వాడే నెయ్యి నాణ్యత మీద అనుమానం వచ్చి పరీక్షల కోసం నమూనాల్ని పంపారు. వీటి ఫలితాలుజులైలో వచ్చాయి. ఈ నివేదికలను టీడీపీ తాజాగా విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న సమాచారం ప్రకారం.. సాధారణంగా ఇంటి వాడకానికి సైతం ఈ తరహా వస్తువుల్ని ఎవరూ అంగీకరించరనే వాదన వినిపిస్తోంది.
కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి నాణ్యత మీద వెల్లువెత్తుతున్న సందేహాలు ఇప్పుడు కోట్లాది మందిని వేదనకు గురి చేస్తున్నాయి. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో తినే లడ్డూ ప్రసాదం నాణ్యత ఇంత అధమ స్థాయిలో ఉండటం ఒక ఎత్తు అయితే.. జంతు కొవ్వుతో ఉండటాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. అయితే.. తాము అందజేసిన నివేదికకు కొన్ని సందర్భాల్లో కచ్చితత్వం లోపించే వీలుందంటూ ఎన్ డీడీబీ కాఫ్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు చెబుతున్నారు.
తీవ్రమైన పోషకాహార లోపాలు ఉన్న ఆవు నుంచి తీసిన పాలతో తయారైన నెయ్యి నమూనాలు పంపినా.. ఆవాలు.. అవిసెలు.. పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ ను ఆహారంగా తీసుకున్న ఆవుల నుంచి తీసిన పాలతో చేసిన నెయ్యి నమూనాలతో.. గెర్బర్ , వెయిబుల్ బెర్న్ ట్రూప్.. రాట్జ్ లాఫ్ తదితర విధానాల ద్వారా సేకరించిన నెయ్యి నమూనాలను పంపితే.. ప్రమాణాల్లో తేడాలు ఉండే వీలుందని చెబుతున్నారు.
గొడ్డుకొవ్వు.. పంది కొవ్వు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న97.96 – 102.04. అయితే.. ఎస్ విలుల్ని చూస్తే.. నివేదికలోని ఈక్వేషన్ నెంబరు మూడులో ఎస్ విలువ 23.22 మాత్రమే ఉంది. నిజానికి ఇది ఉండాల్సింది 95.90 – 104.10వరకుఉండాలి. ఇంత తక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే పామాయిల్.. గొడ్డుకొవ్వు కలిసి ఉంటుందన్న అనుమానాన్ని నివేదిక వెల్లడించింది.
ఈక్వేషన్ సంఖ్య నాలుగులో ఉన్న ఎస్ విలువ 116.09. అయితే..ఇక్కడ ఉండాల్సిన ఎస్ విలువ 97.96 – 102.04. దీంతో ఈక్వేషన్ నాలుగులో ఉన్న పదార్థం పంది కొవ్వు అయి ఉంటుందన్న అనుమనాలు వ్యక్తం చేసింది నివేదిక.