రఘురామరాజు విషయంలో జగన్ ఊహించింది ఒకటైతే జరుగుతున్నది మరొకటి.
నా బెయిలే రద్దు చేయమంటావా అన్న కోపంతో జగన్ హర్టయ్యాడు. మరి బాస్ హర్టయితే… అతని కింద పనిచేసే అధికారులు హర్ట్ కాకుండా ఎలా ఉంటారు?
వెంటనే సీఐడీ రియాక్టైంది.
ఏ కేసు పెడితే బెయిలు రాదో వెతికి మరీ పెట్టారు.
కానీ… అక్కడే ట్విస్ట్. అనుకోని విధంగా వీకెండ్లోను కోర్టు రెస్పాండ్ అయ్యి జైలుకు పంపొద్దని ఆదేశించింది.
అయినా కోర్టు ఆదేశాలు దిక్కరించి జైలుకు పంపారు అధికారులు.
కానీ… రఘురామరాజు నెట్ వర్క్ ని వారు చాలా తక్కువ అంచనా వేశారు.
మెరుపు వేగంతో సుప్రీంకోర్టు దాకా వెళ్లి… ఆర్మీ ఆస్పత్రికి తన అడ్రస్ మార్పించుకున్నారు RRR.
దీంతో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వారి గుండెల్లో రైల్లు పరుగెట్టాయి.
ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఏదో సీరియస్గా జరగబోతోంది.
అంతలో సీఎంలకే దొరకని అమిత్ షా అపాయింట్మెంట్ సంపాదించారు రఘురామ ఫ్యామిలీకి దొరికింది.
వారు అక్కడితో ఆగలేదు. ఓం బిర్లాను కలిసి ఇదేంటన్నారు..
వెంటనే ఎంపీ రఘు రామకృష్ణ రాజు కుటుంబసభ్యుల ఫిర్యాదుపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు.
రఘురామ కుటుంబీకుల ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి స్పీకర్ పంపారు.
రఘురామ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలని హోంశాఖను స్పీకర్ కోరారు.
రఘురామ కుటుంబీకుల ఫిర్యాదు కాపీని హోంశాఖకు స్పీకర్ కార్యాలయం పంపింది.
ఇపుడు ఇక దబిడిదిబిడే… అసలు రాజుగారు బయటకు వచ్చారు.