టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు తాడేపల్లిలో లోకేష్ శిలాఫలకం ఆవిష్కరించారు. పేదల ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరించి అసైన్డ్, కొండ, వాగు, అటవీ, రైల్వే స్థలాలు క్రమబద్ధీకరిస్తామని హామీలతో కూడిన శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంగళగిరివాసులకు లోకేష్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో 20వేల ఇళ్లు నిర్మించి ఇస్తామని పేదలకు లోకేష్ హామీ ఇచ్చారు. ఇక, ఈరోజు తాడేపల్లి నుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర సాయంత్రం ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రవేశించింది. ఈ క్రమంలోనే ప్రకాశం బ్యారేజీ జన సంద్రాన్ని తలపించింది. లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా 150కి పైగా పడవలతో టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక, విజయవాడలో అడుగుపెట్టే ముందు టీడీపీ హయాంలో విజయవాడను నిర్లక్ష్యం చేశాం అని లోకేష్ అంగీకరించాలని మాజీ మంత్రి వెల్లంపల్లి డిమాండ్ చేశారు.
మరోవైపు, లోకేష్ పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద లోకేష్, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుల ఫోటో ప్రదర్శన వైరల్ గా మారింది. ప్రత్తిపాటి టీం ఈ ఏర్పాట్లను ఘనంగా చేసింది. చివరి శ్వాస వరకు మీతోనే ఉంటాం లోకేష్ అంటూ ఆ ఫోటోలో స్లోగన్ వేశారు.