తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆగిపోయిన యువగళం పాదయాత్రను లోకేష్ తిరిగి అదే ప్లేసు నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ నుంచే నేతలకు సంకేతాలు ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ లో ఉండగా చంద్రబాబు అరెస్టు కావడంతో యువగళం ఆగిపోయింది. ఇపుడు మళ్లీ రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళం ప్రారంభించనున్నారు లోకేష్.
లోకేష్ ను అరెస్టు చేయాలని ఆలోచనతో జగన్ ఉన్నట్టు వార్తలు వస్తున్నా… అరెస్టుకు వెరవకుండా మళ్లీ యువగళం మొదలుపెట్టాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. ఒక వేళ తనను అరెస్టు చేస్తే అనంతరం ఏం చేయాలన్న ఆలోచనతో కూడా ఆయన ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
యువగళం పాదయాత్ర ఇక్కడి నుంచి కొత్త మలుపు తీసుకుంటుందని… ప్రజల నుంచి మరింత ఊపు వస్తుందని తెలుగుదేశం యువ నేత లోకేష్ భావిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు కేసులు నిలబడవని… జగన్ అరాచకాలకు ప్రజలు మద్దతు పలకరు అని లోకేష్ ఖరాఖండీగా తేల్చిచెప్పారు. జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చెయ్యాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు.