ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. మరో రెండున్నరేళ్లపాటు జగనన్న వైరస్ తో సహజీవనం చేయక తప్పదని ఎద్దేవా చేశారు. ప్రజలంతా ఓపిక పట్టాలని, రాబోయేది చంద్రన్న ప్రభుత్వమేనని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డికి సబ్జెక్ట్ లేదని, పాలనపై అవగాహన లేదని సజ్జలే ఒప్పుకున్నారని విమర్శించారు. జగన్ కే అవగాహన లేదని, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకి అవగాహన ఎలా ఉంటుందని చురకలంటించారు.
మంగళగిరి నియోజకవర్గ పర్యటనలో భాగంగా దుగ్గిరాలలో స్థానికులతో లోకేష్ మాటామంతీ జరిపారు. దుగ్గిరాలలో ఇటీవల చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను లోకేష్ ఓదార్చారు. వారికి పార్టీ అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. టీడీపీ నేతలు, కేడర్‌తో కలిసి పలు వీధుల్లో, మెయిన్ రోడ్ లో పర్యటించిన లోకేష్… స్థానికులతో మమేకమై వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.
ఒక్క చాన్స్ ఇవ్వండి… అంతా మార్చేస్తానన్న వ్యక్తి.. అందరి జీవితాలనూ భారంగా మార్చేశారని లోకేష్ ఎద్దేవా చేశారు. ప్రజా ప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లో తిరగాలని లోకేశ్ సవాల్ విసిరారు. స్థానిక వ్యాపారులతో మాట్లాడిన లోకేష్…వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారి బండిపై బజ్జీలు తిన్న లోకేష్…గ్యాస్ సిలెండర్ ధర పెరిగిపోయిందని, వ్యాపారులకు గడ్డుకాలమని అన్నారు.
కరోనా ఆంక్షలున్న సమయంలో తన బండిపై బజ్జీలు తింటారో లేదో అన్న సందేహాన్ని వ్యాపారులు వ్యక్తం చేయగా…తనకు కరోనా గిరోనా అంటే భయం లేదని లోకేష్ చెప్పారు. తనపై 11 కేసులున్నాయని, మహా అయితే ఇంకో రెండు కేసులు పెడతారని లోకేష్ చెప్పారు. లోకేష్ జనంతో మమేకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో పర్యటిస్తున్న నారా లోకేష్ గారు అక్కడి చిరువ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు#LokeshInMangalagiri pic.twitter.com/Ub0vdMHX9C
— Telugu Desam Party (@JaiTDP) December 15, 2021