లోకేష్… సరైన అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు నిరంతరం రైతుల సమస్యలను తెలుసుకుంటూ ఉన్న లోకేష్ మరోవైపు సూటిగా, ఘాటుగా విమర్శలతో జగన్ సర్కారును ఇరుకున పెడుతున్నారు.
ఇంకోవైపు కేడర్ మొత్తం ఆశ్చర్యపోయేలా అడుగులు వేస్తున్నారు. చాలాకాలంగా తన కార్యకర్తలకు ఆపద సమయంలో లోకేష్ ఆదుకుంటూనే ఉన్నారు. అయితే, తాజాగా ఆ డోసు పెంచారు. ఎక్కడ ఏ కార్యకర్త కష్టంలో ఉన్నా అండగా నిలుస్తున్నారు. ప్రకాశం జిల్లా, యడవల్లి గ్రామంలో ఇటీవల మరణించిన తెలుగుదేశం కార్యకర్త తెల్లమేకల శ్రీను ఒక సాధారణ కార్యకర్త. నేడు స్వయంగా లోకేష్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు.
చాలా చిన్నవయసులో తండ్రిని పోగొట్టుకున్న చిన్నారులను చూసి లోకేష్ చలించిపోయారుు. వెంటనే అక్కడికక్కడ ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించారు. కుటుంబానికి ఆర్థికసాయంతో పాటు.. పిల్లల చదువు బాధ్యతను పార్టీ తీసుకుంటుదని వారికి హామీ ఇచ్చారు. లోకేష్ భరోసా పట్ల ఆ కుటుంబంలో సంతోషం… సహజంగానే కలిగింది. అయితే, ఇలాంటి చర్యలతో పార్టీ కేడర్ లోకేష్ కి మరింతగా కనెక్ట్ అవుతోంది.