ఇవాళ పల్నాడులో తెలుగుదేశం కార్యకర్తలు మరియు ఇతర నాయకులపై జరిగిన దాడులపై ఆ పార్టీ నేత లోకేశ్ స్పందించారు.
గతంలోనూ ఇదే విధంగా కొన్ని ఘటనలు జరిగాయని,వాటిని నియంత్రించడంలో వైఫల్యం చెందారని ఆయన మండిపడ్డారు.
ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దని తాము ఎప్పటి నుంచో నెత్తీ నోరూ కొట్టుకుంటున్నా పట్టించుకున్న దాఖలాలే ఈ రాష్ట్రంలో లేవని టీడీపీ ఇతర నాయకులు సైతం లోకేశ్ తో కలిపి గొంతు వినిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పల్నాటి ఘటనకు సంబంధించి యువ నేత లోకేశ్ ఏమన్నారంటే….
ఫ్యాక్షన్ నేపథ్యంతోపాటు నేర క్రూర మనస్తత్వం వున్న జగన్‌రెడ్డికి ఒక్క చాన్స్ పేరుతో ముఖ్యమంత్రి గద్దెనెక్కిస్తే ఆంధ్రప్రదేశ్ ని అరాచకప్రదేశ్‌గా మార్చేశాడు. పల్నాడు జిల్లా, దుర్గి మండలం జంగమేశ్వరపాడులో టీడీపీ వర్గీయులపై వైసీపీ దాడి రాక్షసత్వానికి పరాకాష్ట.
వేట కొడవళ్లతో మా టీడీపీ నేత కంచర్ల జల్లయ్యని చంపారు. టీడీపీ కార్యకర్తలు ఎల్లయ్య, బక్కయ్యలని తీవ్రంగా గాయపరిచారు.
జగన్‌రెడ్డి గారూ వందల మంది టిడిపి కార్యకర్తల్ని పొట్టనబెట్టుకున్నా మీ రక్తదాహం తీరదా? మొన్న సుబ్బయ్య, నిన్న చంద్రయ్య, నేడు జల్లయ్యని అంతం చేసిన మీరు ఇంకెంతకాలం సాగిస్తారు ఈ నరమేధం? ఆపకపోతే, తీవ్ర పరిణామాలుంటా యి. అన్ని బాకీలు సెటిల్ చేస్తాం. మా కార్యకర్తల జోలికొచ్చిన ప్రతి వాడు మూల్యం చెల్లించుకోక తప్పదు. వైసీపీ మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జల్లయ్య కుటుంబాన్ని టీడీపీ ఆదుకుంటుంది. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తాం.