బొబ్బిలిలో జరిగిన శంఖారావం సభలో మంత్రి విడదల రజనీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘అమ్మా రజనీ… నాడు మహానాడులో చంద్రబాబు నాటిన తులసి మొక్కనని చెప్పుకున్నావ్…మరి వైసీపీలో చేరాక జగన్ నాటిన గంజాయి మొక్కగా ఎలా మారారమ్మా?’’ అంటూ లోకేష్ చురకలంటించారు. తాడేపల్లి కొంపలో మియావ్ అనే పిల్లి ఉందని, అందరం గట్టిగా పోరాడితే ఆ పిల్లి అక్కడి నుండి పారిపోతుందని ఎద్దేవా చేశారు.
జగన్ కు లూజ్ మోషన్స్ పట్టుకున్నాయని, ప్రభుత్వం సరఫరా చేసే నీరు తాగి లూజ్ మోషన్స్ వచ్చాయని చెబుతున్నారని చురకలంటించారు.ఈ ప్రభుత్వానిది చెత్త పాలన అని, గుంటూరులో ప్రభుత్వం సరఫరా చేసే నీళ్లు తాగి ఎంతో మంది డయేరియా పాలయ్యారని, ఇద్దరు చనిపోయారని చెప్పారు.
బొబ్బిలి నియోజకవర్గంలో సుజయకృష్ణ రంగారావు మంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా అభివృద్ది చేశారని గుర్తు చేశారు. విజయనగరం జిల్లాకు క్యాన్సర్ ఆసుపత్రి తీసుకురావాల్సిన అవసరముందని చెప్పారు. ఏపీ నుంచి హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ కు చాలామంది వస్తున్నారని బ్రాహ్మణి కూడా చెబుతోందని, తన ముద్దుల మామయ్య బాలయ్య బసవతారకం ఆస్పత్రిని నిర్వహిస్తున్న మాదిరిగా ఏపీలో కూడా ఆస్పత్రి తెస్తామని అన్నారు.