టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో లోకేష్ 143వ రోజు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ముత్తుకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై లోకేష్ విమర్శలు గుప్పించారు.
ముత్తుకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన లోకేష్….స్థానిక ఎమ్మెల్యే కాకాణిపై నిప్పులు చెరిగారు. కోర్టు దొంగ కాకాణి తనపైకి ఎమ్మెల్యేలను పంపిస్తున్నాడని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తన పైకి పోలీసులను సైకో జగన్ పంపించాడని, ఆ తర్వాత కోడిగుడ్లు వేయించాడని సంచలన ఆరోపణలు చేశారు.
అయితే, ఆ కోడిగుడ్లతో టీడీపీ కార్యకర్తలు ఆమ్లెట్లు వేసి పంపించారని సెటైర్లు వేశారు. ఊరికో సత్య నాదెళ్లను తయారు చేస్తానని జగన్ చెబుతున్నారని, కానీ ఊరికో అనంతబాబును తయారు చేస్తున్నాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. తన పాదయాత్రను అడ్డుకున్నందుకు వైసీపీ నేతలు ఎన్నో కుట్రలు చేశారని, ఒక సిల్లీ బచ్చా తన పాదయాత్రకు జనాలు రావడం లేదని విమర్శించాలని లోకేష్ చురకలంటించారు. అయితే, కార్యకర్తలే అండగా యువగళం బొమ్మ బ్లాక్ బస్టర్ అయిందని, తన పాదయాత్ర చూసి జగన్ కు మతి పోయిందని అన్నారు. తనపై 20 కేసులు పెట్టారని, ఒక్కటైనా రుజువు చేయగలిగారా అని లోకేష్ సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు లోకేష్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఎవరిపై ఎక్కువ కేసులు నమోదు అవుతాయో వారికి అంత పెద్ద నామినేటెడడ్ పదవి ఖాయమని లోకేష్ సంచలన ప్రకటన చేశారు. టీడీపీ కార్యకర్తలు కేసులకు భయపడవద్దని భరోసానిచ్చారు. రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచుతున్నారని, బిల్డప్ తప్ప బిజినెస్ లేదని విమర్శలు గుప్పించారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, ఒకవేళ వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడితే వాటిని పగలగొట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు రాబోయే ఎన్నికల్లో సీటు ఇవ్వడం లేదని జగన్ చెప్పడంతో ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడుతున్నాడని లోకేష్ ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతల అవినీతిపై సిట్ వేస్తామని లోకేష్ అన్నారు. వైసీపీ నేతలు దోచుకున్న సొమ్మును రికవరీ చేసి ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తామని లోకేష్ అన్నారు.
నెల్లూరు జిల్లా పదికి పది సీట్లు వైసిపికి ఇస్తే, అభివృద్ధి మాట మరిచి మాఫియా రాజ్యం చేశారు. సిల్లీ బచ్చా అనిల్ కి సీటు ఇవ్వనని జగన్ చెప్పేయడంతో ఫ్రస్టేషన్లో నోటికొచ్చినట్టు వాగుతున్నాడు.#ByeByeJaganIn2024#Nellore #NalugellaNarakam pic.twitter.com/fsssB67mGP
— Lokesh Nara (@naralokesh) July 1, 2023
జగన్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలు విభజించింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గూడూరు ని నెల్లూరు జిల్లా లో కలుపుతాం.#YuvaGalamPadayatra pic.twitter.com/4afGnw6WMq
— Lokesh Nara (@naralokesh) July 1, 2023