టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ కదనరంగంలో లోకేష్ కదం తొక్కుతూ పాదయాత్ర చేస్తున్నారు. లోకేష్ యువగళానికి, బహిరంగ సభలకు ఇసకేస్తే రాలనంత జనం వస్తున్నారు. దీంతో, అంతకుముందు లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు, పోలీసులు కలిసి చేసిన, చేస్తున్న విశ్వప్రయత్నాలు విఫలం కావడంతో అధికార పార్టీ నేతలు చేష్టలుడిగిపోయారు.
లోకేష్ పాదయాత్రను ఎలాగైనా భగ్నం చేయాలని తాజాగా వినుకొండ సమీపంలో వందలాది మందితో తొక్కిసలాట జరిగేలా ప్లాన్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఆ చీప్ ట్రిక్ పసిగట్టిన లోకేష్ చాకచక్యంగా పాదయాత్రకు బ్రేక్ ఇవ్వడంతో ఆగంతకుల పప్పులు ఉడకలేదు. దీంతో, చివరకు లోకేష్ పాదయాత్రకు జనం రావడం లేదంటూ తప్పుడు ప్రచారం మొదలుబెట్టారు. లోకేష్ సభలకు, యువగళం పాదయాత్రకు వస్తున్నదంతా పేటీఎం బ్యాచ్ అని తప్పుడు ప్రచారం మొదలుబెట్టారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా లోకేష్ పాదయాత్రకు ఇసకేస్తే రాలనంత జనం వచ్చిన వీడియోలను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియో చూసి లోకేష్ క్రౌడ్ పుల్లరో కాదో చెప్పాలంటూ వైసీపీ నేతలను నిలదీస్తున్నారు. ఓ బహిరంగ సభలో లోకేష్ ప్రసంగిస్తుండగా…నలువైపులా సంద్రంలా వేలాదిమంది జనం చుట్టుముట్టిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This is hugeeeeeeee ????????????????????!#YuvaGalamPadayatra #YuvaGalam#LokeshPadayatra #NaraLokesh#NaraLokeshForPeople#yuvagalamlokesh pic.twitter.com/PV8vC0oq20
— Telugu Desam Party (@JaiTDP) July 31, 2023