సమస్యకు భయపడని వాడే నాయకుడు. తనలో నిజం ఉంటే, తాను మాట్లాడేది వాస్తవం అయితే, తాను చెప్పింది యతాతథంగా ప్రసారం అయినపుడు తప్పులు జరిగినా ఓర్చుకునే తత్వం నాయకుడికి ఉంటే ఆ రాజ్యంలో మీడియా పై ఆంక్షలుండవు.
జగన్ కి ముందు నుంచి మీడియా ఫోబియా.. కొన్ని ఛానెళ్లంటే గిట్టదు. ఎన్నికలకు ముందు తెలుగు మీడియాతో మాట్లాడేందుకు జగన్ భయపడేవారు. చివరకు స్వయంగా తాము ఏబీఎన్ టీవీని రావొద్దని చెప్పాం కదా. ఎందుకు వస్తున్నారు అని అడిగేశారు. అవును వస్తే ఏమవుతుంది. నువ్వు మాట్లాడిందే కదా వాళ్లు రికార్డు చేసేది… అదేంటో మరి.
కట్ చేస్తే … అలాంటి సీన్ ఇపుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీవ్రంగా నష్టపోయి రైతులను కలవడానికి వెళ్లిన లోకేష్ లో కొత్త మనిషి ఆవిష్కృతమయ్యాడు. టీడీపీ శ్రేణులు ఇది కదా మా నాయకుడు అంటే అని గర్వపడేలా లోకేష్ మారి చూపించారు. ఇది మారిన లోకేష్ కాదు, ఇంతకాలం ప్రతికూల మీడియా తప్పుడు ప్రచారంలో మసకబారి ఇపుడు తేటగా రాటుదేలిన నికార్సైన ప్రతిపక్షం.
అసలు విషయం ఏంటంటే… లోకేష్ ఈరోజు మీడియా సమావేశం ప్రారంభించేటపుడు సాక్షి వచ్చిందా లేదా అని కన్ ఫం చేసుకున్న తర్వాత… వచ్చిందని తెలిశాక మీరు తప్పకుండా రికార్డు చేసుకోండి, మీ ముఖ్యమంత్రికి చూపించండి అని ధైర్యంగా చెప్పగలిగాడు అంటే ఆ దమ్ముకి టీడీపీ కేడర్ ఎంతో ముచ్చటపడింది. ఆశించిన దానికంటే మెరుగ్గా, మరింతగా లోకేష్ మారిపోయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో ఈరోజు ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. అదే సమయంలో గతంలో జగన్ మీడియా అంటే భయపడిన వీడియో కూడా దాంతో పాటు వైరల్ అవుతోంది.