జగన్ తన పాలన అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి విఫలయత్నాలు చేస్తున్నారు. అసలే అధ్వానంగా ఉన్న తన అసమర్థ పాలన గురించి అందరూ మాట్లాడితే తన పరువు పోతుందని అందరి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.
తన గురించి ఎవరు విమర్శించినా అరెస్టులు చేస్తున్నారు.
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలు పోస్టు చేశారంటూ ఇద్దరు సీబీఎన్ ఆర్మీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంపై నారా లోకేశ్ స్పందించారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకూ ఎన్నింట్లో అరెస్ట్లు చేశారు? మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు పెట్టడానికి వచ్చినవారిపైనే రివర్స్ కేసు బనాయించారు. @ysjagan దగ్గర పనిచేయాలని అంత ఉత్సాహం, కులపిచ్చి ఉంటే.. పవిత్రమైన ఆ ఖాకీ డ్రెస్ తీసేసి, బులుగు కండువా కప్పుకొండి.(2/2)
— Lokesh Nara (@naralokesh) May 19, 2021