టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు పోలీసుల సాయంతో విశ్వప్రయత్నాలు, విఫల ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. అయినా సరే లోకేష్ మొక్కవోని దీక్షతో పాదయాత్రను దిగ్విజయంగా ముగించారు. విశాఖ జిల్లా అగనంపూడి దగ్గర పైలాన్ ఆవిష్కరించిన లోకేష్ పాదయాత్ర ముగించారు. 226 రోజుల పాటు సాగిన పాదయాత్ర ఈ రోజు ముగిసింది. జనవరి 27న మొదలైన డిసెంబర్ 18న పూర్తయింది. చంద్రబాబు అరెస్ట్ తో దాదాపు నెలన్నర రోజులపాటు పాదయాత్రకు బ్రేక్ పడింది.
లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా గాజువాక ప్రాంతం టీడీపీ, జనసేనే కార్యకర్తలు, నేతలతో జనసంద్రంగా మారింది. గాజువాక జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభించి శివాజీనగర్ దగ్గర ముగించిన లోకేష్ అక్కడ పైలాన్ ఆవిష్కరించారు. యువగళం ముగింసు సందర్భంగా లోకేష్ తోపాటు నారా భువనేశ్వరి, నందమూరి వసుంధరాదేవి, బాలకృష్ణ చిన్న కూతురు తేజశ్విని, లోకేష్ తోడల్లుడు భరత్, ఇతర కుటుంబసభ్యులు నడిచారు.
ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై దాడి చేశాడని, ఆ దాడిని తాను కళ్ళారా చూశానని జగన్ పై మండిపడ్డారు. నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళమని, అణగారిన వర్గాలకు, యువతకు యువగళం భరోసానిచ్చిందని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటానని భరోసానిచ్చారు. పాదయాత్రలో పాల్గొన్న వారికి, సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
పాదయాత్రలో లోకేష్ 3132 కిలోమీటర్లు నడిచి 97 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేశారు. 4000 కిలోమీటర్లు సాగాల్సిన యువగళం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం, చంద్రబాబు అరెస్టు వంటి కారణాలతో ముందుగానే లోకేష్ తన పాదయాత్రను ముగించారు.
దిగ్విజయంగా ముగిసిన యువగళం.. చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం
గాజువాక శివాజీనగర్ వద్ద యువగళం ఆవిష్కృతమైన ముగింపు ఘట్టం.
అభిమానుల జయజయధ్వానాల నడుమ పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్.
కార్యకర్తల నినాదాలు, బాణాసంచా మోతలతో దద్దరిల్లిన పైలాన్ ఆవిష్కరణ ప్రాంతం.
జై తెలుగుదేశం, జయహో… pic.twitter.com/oILmpYYkpc— Telugu Desam Party (@JaiTDP) December 18, 2023