జగన్ హయాంలో టీడీపీ నేతలపై నానాటికీ దాడులు పెరిగిపోతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకొని ఆయన సతీమణి నారా భువనేశ్వరి వరకు టీడీపీ నేతలను, కార్యకర్తలను దూషించడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, టీడీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు చేసిన వైసీపీ నేతలకు పోలీసులు అండగా ఉంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా తాజాగా గుంటూరు జిల్లా పెదనందిపాడులో వైసీపీ కార్యకర్తలు మరోసారి అరాచకానికి తెగబడ్డారు.
టీడీపీ కార్యకర్త వెంకటనారాయణ తలను సీసాలతో పగులగొట్టి ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించిన వైనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వెంకటనారాయణ పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మద్యం మత్తులో చంద్రబాబును దూషించిన వైసీపీ నేతలను వారించిన వెంకట నారాయణపై వారు దాడికి తెగబడ్డారు.
ఈ క్రమంలోనే ఈ ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలందరూ పిశాచకులని లోకేష్ నిప్పులు చెరిగారు. చంద్రబాబును దూషిస్తోన్న వైసీపీ శ్రేణులను ప్రశ్నించడమే దళితుడైన వెంకటనారాయణ చేసిన నేరమా..? అని లోకేష్ నిలదీశారు. మద్యం సీసాలతో కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి రాక్షస మూకల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తప్పుని తప్పని చెబితే చంపేస్తారా ? మంచి చెప్పే మనుషుల ప్రాణాలే తీసేస్తారా ? అని నిలదీశారు.
ఒంగోలులో వైశ్యుడైన సొంత పార్టీ నేత సుబ్బారావు గుప్తా, నేడు టీడీపీ కార్యకర్త వెంకట నారాయణ.. ఇలా రోజుకొకరు వైసీపీ పిశాచ ముఠాలకి బలవ్వాల్సిందేనా..? అని లోకేష్ మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఇవన్నీ చేయిస్తోందనేది సుస్పష్టమని, అడ్డుకోవాల్సిన పోలీసులేమయ్యారని లోకేష్ ప్రశ్నించారు.
గుంటూరు జిల్లా పెదనందిపాడు @ysjagan జన్మదిన వేడుకల్లో చంద్రబాబు గారిని దూషిస్తోన్న వైసీపీ శ్రేణులను ప్రశ్నించడమే దళితుడైన వెంకటనారాయణ చేసిన నేరంగా మద్యం సీసాలతో కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించిన రాక్షసమూకల చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/3) pic.twitter.com/1QJUgAYFrd
— Lokesh Nara (@naralokesh) December 21, 2021