తెలంగాణ మంత్రి కేటీఆర్ నోట.. జగన్ విధ్వంస పాలన మాట వచ్చిందంటూ.. టీడీపీ నేతలు ట్వీట్ చేశారు. ఏపీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను.. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తమ ట్విటర్ ఖాతాలకు జతచేశారు.
క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై చంద్రబాబు, లోకేష్‌లు నిశితంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పై .. తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల వీడియోను.. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తమ ట్విటర్ ఖాతాలకు జతచేశారు. ఒక్క ఛాన్స్ పరిస్థితి ఇలా ఉందంటూ కేటీఆర్ మాటలను ట్వీట్ చేశారు.
జగన్ పాలన గురించి.. ఆయన స్నేహితుడే ఇలా వ్యాఖ్యానించారంటే.. ఎవరైనా అర్ధం చేసుకోవచ్చు.. ఏపీలో ఎంత మంచి పాలన అందిస్తున్నారో.. అని వ్యాఖ్యానించారు.
క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ పరోక్షంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పరిస్థితిపై మిత్రులు చెప్పిన మాటలను ఆయన ప్రస్తావించారు.
‘‘పక్క రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారు. అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు.. పక్క రాష్ట్రం వెళ్లి మీరే చూడండి. అక్కడికి వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు. కొన్ని మాటలంటే కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ.. అవి వాస్తవాలు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటివారు స్పందించారు. అయితే.. విపక్షం టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేష్‌లు కూడా ఏపీపై ఫైరయ్యారు. “జగన్‌కు వాస్తవాలు చెబితే.. మేం ఇబ్బంది పెడుతున్నామని.. తన ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నామని.. అంటున్నారు. దుష్ట చతుష్టయం అని పేరు పెడుతున్నారు. మరి ఇప్పుడు కేటీఆర్ కూడా ఈ దుష్టచతుష్టయంలో ఉన్నారా? దీనికి జగన్ సమాధానం చెప్పాలి“ అని లోకేష్ ఫైర్ అయ్యారు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.