ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో ఓనమాలు దిద్దుకున్నవాళ్ళం, నాడు కుర్రోళ్ళం. ఎవరు మరిచినా నిన్ను, మీ పోరాటాన్ని మరవలేము నాయకా… ఈ రోజు మీ జయంతి అమెరికాలో 4 విశ్వవిద్యాలయాలలో చదివావు. దేశం కోసం నీ జీవితం అనుకున్నావు. త్యాగం చేసావు. నాడు ఎన్ని వేధింపులు ఎదుర్కొన్నా… ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టి 1977లో విజయం సాధించావు, పదవులు వద్దనుకున్నావు.
ఇండియాలో న్యాయవ్యవస్థకు, ప్రాథమిక హక్కులకు నాడు కేంద్ర పాలకుల నుంచి వచ్చిన ముప్పు తప్పించావు, మళ్ళా రాజ్యాంగ సవరణలు చేయించావు, నీవు అమరుడివయ్యావు.
దాదాపు 40ఏళ్లకు గత కొంతకాలంగా దేశంలో న్యాయవ్యవస్థకు మళ్ళా ముప్పు దాపురించింది నాయకా, దాని స్వతంత్ర వ్యవస్థను పాలకులు పాడుచేసే పరిస్థితులు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. అలాగే ప్రాథమిక హక్కులకు కూడా , అలాగే సామరస్య వాతావణానికి కూడా ముప్పు వస్తోంది.
మా ప్రజల మేలు కోసం మళ్ళా ఎప్పుడు వస్తావు లోక నాయకా..?