అదేంటి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ మంత్రి వర్గం లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది అనుకుంటున్నారు కదా.
నిజమే. తెలంగాణ సర్కారు మరో పది రోజులు లాక్ డౌన్ పొడగించింది. కానీ తాజాగా సవరించిన సమయాలను బట్టి చూస్తే లాక్ డౌన్ నిబంధనల ఇబ్బందులు చాలా వరకు తొలగినట్లే.
మనం సాధారణంగా 10- 6 వరకు ఎనిమిది గంటలు పనిచేస్తాం. ఇపుడు కూడా కేసీఆర్ కాస్త త్వరగా పడుకోండి పొద్దున్నే లేచి 8 గంటలు పనిచేసుకోండి అంటున్నాడు.
తాజా మంత్రి వర్గ నిర్ణయం ప్రకారం లాక్ డౌన్ వ్యాపార సడలింపును ఉదయం పది నుంచి 2 గంటల దాకా పొడగించారు. టెక్నికల్ గా 1 గంట అంటున్నారు గాని నిజానికి అది రెండు గంటల వరకు సడలింపే అన్నమాట.
ఇంకే ముంది నార్మల్ షిఫ్ట్ కాస్తా ఉదయం షిఫ్ట్ అయ్యిందన్నమాట.
అసలు మీ పాయింటేట్రా అనుకుంటున్నారు కదా… ఏం లేదు భయ్యా… కేసీఆర్ కర్ర విరగకూడదు, పాము సావకూడదు అన్నట్లు చెబుతున్నాడు.
లాక్ డౌన్ పెట్టినట్టుండాలే… జీఎస్టీ దండిగా రావాలి, అందరూ పనిచేసుకోవాలి, కరోనా కూడా పోవాలి అని మల్టీ లెవెల్ ప్యాకేజీ నిర్ణయాలు తీసుకుంటున్నడు.
లాక్ డౌన్ కి లాక్ డౌన్. వ్యాపారానికి వ్యాపారం… అదిరింది కేసీఆర్, నీ ఐడియా అదిరింది.
మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ సమావేశమైన రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
— Telangana CMO (@TelanganaCMO) May 30, 2021