సినిమా పనుల్లో భాగంగా వేర్వేరు ప్రాంతాలకు ట్రావెల్ చేయాల్సిన అవసరం సినిమా వాళ్లకు ఉంటుంది. ఆ సందర్భంగా వారికి అనూహ్యమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ కు ఎదురైంది. విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్.. పూరీ.. చార్మీ కలిసి నిర్మిస్తున్న మూవీ ‘లైగర్’. దీనికి సంబంధించిన షూట్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. దీంతో.. వారి మకాం దేశ ఆర్థిక రాజధానికి మారింది.
కొద్ది రోజులుగా ముంబయిలోనే ఉంటూ పనులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ముంబయి రోడ్డు మీద కారులో వెళుతున్న పూరీ-చార్మీలకు అనుకోని వింత అనుభవం ఎదురైంది. లైగర్ షూటింగ్ కోసం కారులో వెళుతున్న వేళ.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వారి కారు ఆగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రమోద్ అనే కుర్రాడు వారిని కలిశాడు. కారు నెంబరు టీఎస్ అని ఉండటంతో తమ ప్రాంతానికి చెందిన వారే అన్న ఉద్దేశంతో పలుకరిద్దామని వచ్చానని.. తీరా చూస్తే.. ప్రముఖ దర్శకుడు పూరీ కనిపించటంతో ఎంతో ఎగ్జైట్ అయ్యాడు.
తాను ఇంటర్ చదువుతున్నానని.. మధ్యలో డ్రాప్ అయ్యానని.. ఆన్ లైన్ క్లాసులు నడుస్తున్నట్లు చెప్పారు. సమయానికి తన చేతిలో సెల్ కూడా లేదన్న అతని మాటకు.. పూరీ ఫర్లేదని చెప్పారు. లైగర్ సినిమా కూడా తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. దీన్నంతా కారులో ఉన్న చార్మీ వీడియో తీసింది. దాన్ని ట్విటర్ లో షేర్ చేయాలని ప్రమోద్ కోరగా.. అందుకు పూరీ ఓకే చెప్పి.. తాజాగా వీడియోను.. దాని వివరాల్ని పోస్టు చేశారు. సినిమాటిక్ అనుభవంగా ఉన్న ఈ వైనం అందరిని ఆకర్షించేలా ఉంది.
This cute kid came across #purijagannadh in mumbai traffic signal .. was mesmerised seeing him ,this post is specially for Pramod , because he mentioned he wanted a selfie but unfortunately didn’t have a phone ..@PuriConnects pic.twitter.com/t1JiDdJlhH
— Charmme Kaur (@Charmmeofficial) October 25, 2021