ఏపీలో రెడ్లు ప్రథమ పౌరులు అయితే అందులో ఒకటో రెడ్డి కమ్ క్రిస్టియన్ జగన్. రెండో రెడ్డి గా సాయిరెడ్డిని చెప్పుకోవచ్చు. (ఈ ప్లేస్ సజ్జలది అని కొందరంటారు ఆ చర్చ ఇంకోసారి చూద్దాం.)
ఈ రెండో రెడ్డిగారికి అబద్ధాలు చెప్పడం అంటే మహా సరదా.
ఈయన చెప్పిన అబద్ధాలతో పుస్తకం రాస్తే లక్ష పేజీలతో పుస్తకం విడుదల చేయగలమో లేదో అనుమానమే.
45 మంది డీఎస్పీల్లో 42 మంది కమ్మోళ్లే అని చెప్పిన అబద్ధం, లేని పింక్ డైమండ్ బాబు ఎత్తుకెళ్లాడు అని చెప్పిన అబద్ధం ఏపీలో బ్లాక్ బస్టర్స్.
అలా ఆయన ఒక్కరోజు కూడా అబద్ధంతో కాపురం చేయకుండా ఉండలేరు.
చంద్రబాబు మీద అబద్ధాలు చెప్పి చెప్పి ఆయనకు నిజం నోట వెంట రావాలంటే కష్టంగా మారిపోయింది.
రియల్ ఎస్టేట్ ఆగిపోయి, కరోనాతో పరిశ్రమలు ఆగిపోయి, ఉన్న పరిశ్రమలను తరిమేసిన్ జగన్ హయాంలో లక్షలు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నారు ఈ రెండో రెడ్డి.
నిజానికి ఏపీలో కొత్త ఉద్యోగాలు రావడం మాట అటుంచితే ఉన్న ఉద్యోగాలు ఊడబీకిన విషయం అందరికీ తెలుసు. కాంట్రాక్టు ఉద్యోగులను ఒక్కరినీ పర్మనెంట్ చేయలేదు. కానీ
తాజాగా ఆయన ఒక పెద్ద అబద్ధం ఆడబోయి బొక్కబోర్లా పడ్డారు. భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించినట్లు ఆయన పోస్టరు పెట్టారు.
తమాషా ఏమంటే… అందులో జగన్ ఫొటో ఇజ్రాయిల్ (ఏసు ప్రార్థన కోసం వెళ్లినపుడు) టూర్లో దిగిన ఫొటో.
ఇక ఇదిగో ఇలాంటి మందికి ఉపాధి కల్పించాం అని ఒక ఫొటో వేశారు. ఆ ఫొటో తమిళనాడులోని ఒక పరిశ్రమలో ఉద్యోగులు పనిచేస్తున్న ఫొటో.
ఇంత పచ్చిబద్ధమా?
నిజంగా ఉద్యోగాలు జగన్ కల్పించి ఉంటే… రాష్ట్రంలో ఒక్క ఫొటో అయినా దొరకదా? ఇంత దారుణమా? ఇంత పచ్చి అబద్ధమా?
ఏమయ్యా A2 ఫేక్ రెడ్డి నిజం చెబితే నీ తల వెయ్యి వక్కలవుతుంది అని శాపం ఏదైనా ఉందా ? నాడు పింక్ డైమండ్ మొదలు నేడు పరిశ్రమల వరకూ అన్నీ ఫేకులే ఎక్కడో తమిళనాడులో ఫోటోలు తీసుకువచ్చి జగన్ పికాడు అని ప్రచారం చేయటానికి సిగ్గు లేదు కనీసం ఒక పాన్ షాప్ అయినా వచ్చిందా ? pic.twitter.com/mVYJ3CJGYj
— Lokesh Yuvasena (@YuvasenaLokesh) March 31, 2021
రెండో రెడ్డి గారి పాత అబద్ధాల గురించి కొంత చరిత్ర ఇక్కడ చూద్దామా?
చంద్రబాబు పింక్ డైమండ్ అనేది అబద్దం❌
జగన్ రెడ్డి తలనీలాలు స్మగ్లింగ్ అనేది నిజం✅ https://t.co/THmPIceVza— Jayapal Reddy (@JayapalReddyTDP) March 30, 2021
స్వామివారి పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని కారుకూతలు కూసిన వైసీపీ పెద్దమనుషులు అధికారంలోకి రాగానే అసలు పింక్ డైమండ్ అనేదే లేదని లెంపలు వేసుకున్నారు. మరి అదే పెద్దమనుషులు ఈరోజు స్వామివారికి భక్తులు సమర్పించిన తలనీలాలు దోచుకుంటున్నారు అంటే… ఏంటీ దౌర్భాగ్యం? pic.twitter.com/t8IEetaAgw
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) March 31, 2021